Moviesసుహాసిని ఆ ఒక్క‌ కార‌ణంతోనే తెలుగు సినిమాల‌కు దూర‌మైందా...!

సుహాసిని ఆ ఒక్క‌ కార‌ణంతోనే తెలుగు సినిమాల‌కు దూర‌మైందా…!

రమ్యకృష్ణ మాదిరిగా సుహాసిని వరుసగా సినిమాలు చేయకపోవడానికి కారణం అదేనా..? అంటే చాలా కారణాలు వెతుక్కోవాల్సి వస్తుంది. వాస్తవంగా చూస్తే రమ్యకృష్ణ కంటే ముందు తరం కథానాయికలలో అగ్ర స్థానం సంపాదించుకున్నారు సుహాసిని. రాధ, రాధిక, విజయశాంతి, మాధవి, సుమలత లాంటి సీనియర్ హీరోన్స్ జనరేషన్‌లో సుహాసినీకంటూ ఓ ప్రత్యేక స్థానం దక్కింది. ఆమె త‌రం హీరోయిన్లు అంద‌రూ గ్లామ‌ర్ రోల్స్‌తో అందాల ఆర‌బోత‌కు అడ్డు చెప్పేవారే కాదు.

అయితే సుహాసిని ఈ విష‌యంలో ఎప్పుడూ లిమిట్స్ క్రాస్ చేయ‌లేదు. హోమ్లీ క్యారెక్ట‌ర్ల‌తో ఫ్యామిలీ ఆడియెన్స్ లో గుడ్ లుక్స్ తెచ్చుకుంది. ఆమె మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి అప్పటి సీనియర్ హీరోలతో ఎన్నో సినిమాలు చేసిన సక్సెస్‌ఫుల్ హీరోయిన్. సాధారణంగా హీరోయిన్స్ పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. పిల్లలు సంసారం అంటూ దాదాపు పదేళ్ళ గ్యాప్ తీసుకుంటారు.

ఆ తర్వాత నటించాలని ఆసక్తి ఉంటే అదృష్టం కొద్దీ అవకాశాలు వస్తే మొహానికి రంగేసుకుంటారు. లేదంటే అంతే. అయితే, ఇలాంటి సీనియర్ హీరోయిన్స్‌ను ఎక్కువగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్, కొరటాల శివ లాంటి ఇప్పటి స్టార్ డైరెక్టర్లు తెరమీదకి తీసుకొస్తున్నారు. ఎక్కువగా ఇలా సీనియర్ నటీమణులను మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్న ఘనత మాటల మాంత్రీకుడికే దక్కింది.

అత్తారింటికి దారేదీ సినిమాతో నదియా బాగా పాపులర్ అయింది. ఈమెను మిర్చీ సినిమాతో తీసుకొచ్చింది కొరటాల శివ అయినా ఎక్కువగా మాత్రం క్రెడిట్ త్రివిక్రమ్‌ అందుకున్నారు. అలాగే ఖుష్బూని అజ్ఞాతవాసి సినిమాలో నటింపచేశారు త్రివిక్రమ్‌. ఇలా సుహాసినీ, తులసి లాంటి వారు ఇప్పుడు వెండితెరపై వెలుగుతున్నారు. అయితే, అందరికంటే కూడా తక్కువ సినిమాలు చేస్తుందీ సుహాసిని మణిరత్నమే.

ఆమె తలుచుకుంటే ఏడాదిలో 20 సినిమాలు అవలీలగా చేయగలరు. కానీ, వచ్చిన ప్రతీ పాత్రను ఒప్పుకోవడం లేదు. పైగా చాలా సెలెక్టివ్‌గా దర్శకులను చూసి సినిమా ఒప్పుకుంటున్నారు. దానివల్లే సుహాసిని వెండితెరమీద అంతగా కనిపించడం లేదు. కానీ, ఓ పాత్ర చేస్తే మాత్రం అది పది కాలాలపాటు గుర్తుండిపోయేలాంటిదే ఎంచుకుంటున్నారు. అదే కదా సీనియర్ నటీమణులకి కావాల్సింది. పనికిమాలిన పాత్రలు పది చేసి ఏం లాభం అని ఆలోచిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news