Moviesఅనుష్క - నాగ‌చైత‌న్య ప్రేమ నిజ‌మేనా... ఇది బ‌య‌ట పెట్టింది ఎవ‌రు......

అనుష్క – నాగ‌చైత‌న్య ప్రేమ నిజ‌మేనా… ఇది బ‌య‌ట పెట్టింది ఎవ‌రు… అసలేం జ‌రిగింది…!

టాలీవుడ్ స్వీటీబ్యూటీ 40 ఏళ్ల‌కు ద‌గ్గ‌రైపోయింది. ఇప్ప‌టికే పెద్ద ముదురు ముద్దుగుమ్మ‌.. అయినా ఇంకా పెళ్లి గిల్లీ అన్న మాట లేకుండా సినిమాలు చేస్తోంది. త‌న‌కంటే వ‌య‌స్సులో చిన్నోడు అయిన యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టికి జోడీగా అనుష్క ఓ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ముదురు భామ‌లు త‌మ‌న్నా, న‌య‌న‌తార లాంటి వాళ్లు క‌నీసం సీనియ‌ర్ హీరోలు, స్టార్ హీరోల ప‌క్క‌న అయినా ఛాన్సులు కొడుతున్నారు. కానీ అనుష్క‌కు మాత్రం ఆ ఛాన్సులు కూడా రావ‌డం లేదు. ఆమెకు రాక రాక న‌వీన్ పోలిశెట్టి లాంటి హీరో ప‌క్క‌న ఛాన్స్ వ‌చ్చిందంటే ఆమెను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇక అనుష్క కెరీర్లో ప్ర‌భాస్‌తో వ‌చ్చిన‌న్నీ రూమ‌ర్లు మ‌రే విష‌యంలోనూ రాలేదు. వీరిద్ద‌రు క‌లిసి బిల్లా – మిర్చి – బాహుబ‌లి సీరిస్ సినిమాల్లో న‌టించారు. ఈ అన్నీ సినిమాలు సూప‌ర్ హిట్టే అయ్యాయి. ప్ర‌భాస్ – అనుష్క జంట‌ను తెర‌మీద చూసేందుకు.. వీరి అన్‌స్క్రీన్ రొమాన్స్ ఎంజాయ్ చేసేందుకు ప్రేక్ష‌కులు ఎంత‌లా ఇష్ట‌ప‌డ‌తారో చెప్ప‌క్క‌ర్లేదు. అనుష్క – ప్ర‌భాస్‌కు సోష‌ల్ మీడియా సాక్షిగా ఎన్ని వంద‌ల‌, వేల సార్లు పెళ్ల‌య్యిందో చెప్ప‌క్క‌ర్లేదు.

అయితే ప్ర‌భాస్ – అనుష్క రూమ‌ర్ల కంటే ముందే ఇంకా చెప్పాలంటే ప్ర‌భాస్‌తో అనుష్క మిర్చి సినిమా చేస్తున్న‌ప్పుడే నాగ‌చైత‌న్య – అనుష్క ప్రేమ‌లో ఉన్నార‌ని.. వీరు త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.. వీరి పెళ్లికి నాగార్జున కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని పుకార్లు వ‌చ్చాయి. ఇవి పుకార్లు అయితే ప‌ర్వాలేదు.. ఏకంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయిన ఆంధ్ర‌జ్యోతి త‌న ప్ర‌ధాన దిన‌ప‌త్రిక‌లోనే వీరి పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని.. నాగార్జున కూడా ఓకే చెప్పేశాడంటూ వేసిన వార్త అప్ప‌ట్లో సెన్షేష‌న‌ల్ అయ్యింది.

అయితే ఈ వార్త‌ల‌పై నాగార్జున తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. అస‌లు ఇలాంటి వార్త‌లు ఎందుకు రాస్తారంటూ మండిప‌డ్డాడు. ఆ త‌ర్వాత ఆంధ్ర‌జ్యోతి కూడా ఈ వార్త‌ను స‌వ‌రించుకుంది. ఏదేమైనా త‌న తండ్రికి చాలా క్లోజ్‌గా ఉండే అనుష్క‌తో నాగ‌చైత‌న్య పెళ్లి వార్త అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నం అయ్యింది. ఆ వివాదం ముగిశాక ప్ర‌భాస్ – అనుష్క పెళ్లి ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news