Moviesఓరి నీ వేషాల్లో.. బిడ్డను చూడాలంటే ఇన్ని కండీషన్ లా..?

ఓరి నీ వేషాల్లో.. బిడ్డను చూడాలంటే ఇన్ని కండీషన్ లా..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఓవర్ చేస్తుందా..? అంటే అవుననే అంటున్నారు కొందరు జనాలు . అయితే మరి కొంతమంది మాత్రం తల్లి అయ్యాక ఆ మాత్రం కేరింగ్ ఉండాలి అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో కొన్ని పాజిటివ్ కామెంట్స్ కొన్ని నెగటివ్ కామెంట్స్ తో అలియా భట్ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది . దానికి మెయిన్ రీజన్ ఆలియా భట్.. తన కూతుర్ని చూడడానికి ఇంటికి వస్తున్న వాళ్ళకి పెట్టిన కండిషన్స్ కారణం అంటూ తెలుస్తుంది .

మనకు తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అలియా భట్..తన కోస్టార్ బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు ఏప్రిల్ లో ఒకటి అయ్యారు . పెళ్లి అయిన రెండు నెలలకే మూడో నెల అంటూ బిగ్ షాక్ ఇచ్చింది ఆలియా భట్. దీంతో ఈరోజుల్లో ఈ యవ్వారాలు కామన్ అంటూ లైట్ తీసుకున్నారు జనాలు . కాగా రీసెంట్గా నవంబర్ ఆరవ తేదీ పండంటి పాపకు జన్మనిచ్చింది అలియా భట్ . ఈ క్రమంలోనే ఆమెకు సోషల్ మీడియాలో కంగ్రాట్యులేషన్స్ చెప్పుకొచ్చారు ఫాన్స్ .

అయితే అలియా భట్ కూతురు ని చూడడానికి ఇంటికి వస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ కి ఇతర ఫ్రెండ్స్ కి ఆలియా భట్ క్రేజీ కండిషన్ పెట్టిందట . తన కూతుర్ని చూడడానికి ఇంటికి వస్తున్న ప్రతి ఒక్కరూ కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ కంపల్సరీ గా తీసుకోరావాలని చెప్పుకొచ్చిందట. అంతేకాదు మూడు రోజులు క్వారెంటైన్ లో ఉన్న తర్వాతే తన బిడ్డను తాకాలని చెప్పుకోస్తుందట. దీంతో ఒక్కసారిగా ఆమె బిడ్డను చూద్దామని ఆశగా ఉన్న వాళ్లకి షాకింగ్ గా అనిపించింది. సర్టిఫికెట్ వరకు ఓకే ఈరోజుల్లో కామన్ గా వినిపిస్తుంది. మరి మూడు రోజులు క్వారంటైన్ అన్నది మాత్రం ఓవర్గా అనిపిస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. అయితే కొందరు మాత్రం ఒక తల్లిగా తన బిడ్డ పై ఆ మాత్రం కేరింగ్ జాగ్రత్తలు ఉంటాయి.. ఈ విషయంలో కూడా ఆమెను ట్రోల్ చేయద్దు అని చెప్పుకొస్తున్నారు జనాలు. ఏది ఏమైనా సరే బిడ్డ విషయంలో అలియా భట్ ఓవర్ కేరింగ్ తీసుకుంటుంది అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news