Moviesకూతురు పుట్టిన వేళ విశేషం.. అలియా భట్ సంచలన నిర్ణయం..!?

కూతురు పుట్టిన వేళ విశేషం.. అలియా భట్ సంచలన నిర్ణయం..!?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే . ఆర్ఆర్ఆర్ తో తెలుగులో కూడా తన నటనకు మంచి మార్కులు వేయించుకున్న ఆలియా భట్ .. ఆదివారం నాడు పండంటి ఆడబిడ్డ కు జన్మనిచ్చింది . మనకు తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అలియాభట్.. పెళ్లయిన రెండు నెలలకే మూడో నెల అంటూ బిగ్ బాంబ్ పేల్చింది. ఆఫ్ కోర్స్ ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అంటూ జనాలు కూడా లైట్గా తీసుకున్నారు.

అయితే రీసెంట్ గా ఆలియా భట్ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ క్రమంలోనే అలియా భట్ రణబీర్ కపూర్ జంటకు బెస్ట్ విషెస్ అందిస్తున్నారు ఫాన్స్. అయితే కొందరు ట్రోల్ చేస్తున్నారు . పెళ్లయిన 7 నెలలకే నువ్వు బిడ్డకు జన్మనివ్వడం వెరీ బ్యాడ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు . అయితే కూతురు పుట్టిన వేళ విశేషం ఆలియా భట్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు బాలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది .

అందుతున్న సమాచారం ప్రకారం అలియా భట్ ఇక సినిమాలకు బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉందట . పాపకు మూడేళ్లు వచ్చేవరకు సినిమాలకు సైన్ చేయనని.. పాపతోనే టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయిందట . ఇది నిజంగా అలియా భట్ అభిమానులకు షాకింగ్ అని చెప్పాలి . మనకు తెలిసిందే బాలీవుడ్ లో అలియా భట్ కు ఎంతటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఇలాంటి టైం లో అలియాభట్ సినిమాలకు బ్రేక్ వేయడం కరెక్టేనా ..? అది కూడా ఇన్ని ఇయర్స్ బ్రేక్ వేయడం కరెక్టేనా ..? అంటూ బాధపడుతున్నారు. అయితే తల్లి గా మీ బాధ్యతలు నెరవేర్చుకోవడానికి మీ డ్రీమ్ వదులుకుంటున్నారు గ్రేట్ అంటూ ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news