Moviesఅరెరెరె..రౌడీ హీరో అలా అనేశాడు ఏంటి..విజయ్ నోటి నుంచి ఊహించని మాట..!?

అరెరెరె..రౌడీ హీరో అలా అనేశాడు ఏంటి..విజయ్ నోటి నుంచి ఊహించని మాట..!?

జనరల్ గా మనిషన్న ప్రతి ఒక్కరికి పొగరు ఉంటుంది. అహంకారం ఉంటుంది. కాకపోతే అవి లిమిట్స్ లో ఉంటేనే హెల్తీ. లిమిట్స్ క్రాస్ చేస్తే దానికి తగ్గ పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాపం విజయ్ దేవరకొండ తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ లైగర్ సినిమా ప్రమోషన్స్ లో కాస్త ఘాటుగానే తన యాటిట్యూడ్ చూపించాడు . అఫ్ కోర్స్ అది విజయ్ దేవరకొండ బిహేవియర్ తన మాట తీరు అంతే కావచ్చు. అయితే దానిని పట్టుకొని కొందరు జనాల విపరీతంగా విజయ్ ని ట్రోల్ చేశాడు.

అంతేనా ఆయన సినిమాలోని “ఆగ్ లాగా దేంగే” అనే డైలాగులు పట్టుకొని పచ్చి బూతులు తిట్టారు.లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం విజయ్ కారణం కాదు అన్న సంగతి అందరికీ తెలిసిందే. డైరెక్షన్ పరంగా తప్పులు ఉండడంతో విజయ్ నటన పరంగా సూపర్ గా నటించిన సినిమా హిట్ అవ్వలేకపోయింది. ఆశ్చర్యం ఏమిటంటే.. సినిమా ఫ్లాప్ అయ్యిందన్న జనాలే విజయ్ దేవరకొండను మెచ్చుకున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. తన పూర్తి బాడీని ట్రాన్స్ ఫామ్ చేసుకున్నాడు. సినిమా కోసం కొన్ని ఏళ్ళు ఫుడ్ డైట్ ఫాలో అయ్యాడు. తనకి ఇష్టమైన ఫుడ్స్ ని అవాయిడ్ చేశాడు.

ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకోవాలనుకున్నాడు. కానీ తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు సినిమా ఫ్లాప్ అయింది. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది . ఈ క్రమంలోనే కొందరు విజయ్ యాటిట్యూడ్ కారణంగానే ఈ సినిమా ఫ్లాప్ అయిందని అంత పొగరు ఉండకూడదని చెప్పుకొచ్చారు. కాగా రీసెంట్ గా జరిగిన సైమ అవార్డు వేడుకల్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ ..లైగర్ ఫ్లాప్ పై స్పందించాడు. ” ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సినిమా తో ఇండస్ట్రీ కి హిట్ ఇవ్వాలనుకున్న. లైగర్ తో సినిమాతో ఇండస్ట్రీకి హిట్ ఇవ్వాలి అనుకున్నాను.. నిజంగా చెప్తున్నాను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం.

కానీ ఫలితం వేరేలా ఉంది. ఓకే నో ప్రాబ్లం . నెక్స్ట్ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం..” అంటూ విజయ్ లైగర్ గురించి చాలా సాఫ్ట్ గా మాట్లాడారు. నిజానికి విజయ్ గత తాలూకా ఈవెంట్స్ మాటలను సైమా అవార్డు వేడుకలో మాట్లాడిన మాటలతో కంపేర్ చేస్తే చాలా చేంజ్ ఉంది. ఏ ఈవెంట్లో మాట్లాడిన విజయ్ టోన్లో ఒక హెడ్ వెయిట్ కనిపిస్తుంది . కానీ సైమా అవార్డ్ వేడుకల్లో మాత్రం ఓ పశ్చాతాపం కనిపిస్తుంది అంటున్నారు జనాలు. కాగా విజయ్ వరుసగా మూడు హ్యాట్రిక్ ఫ్లాప్ లను తన ఖాతాలో వేసుకున్నారు. లైగర్ మూడు సినిమాలో అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. శివనిర్వాణ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news