Moviesవాల్తేరు వీరయ్య: నిజంగానే అలాంటి పని చేసిన చిరు..బాబీని బూతులు తిడుతున్న...

వాల్తేరు వీరయ్య: నిజంగానే అలాంటి పని చేసిన చిరు..బాబీని బూతులు తిడుతున్న మెగా ఫ్యాన్స్..!!

ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . మరీ ముఖ్యంగా డైరెక్టర్ బాబీని మెగా ఫ్యాన్స్ బూతులు తిట్టడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. దానంతటకీ కారణం రీసెంట్గా రిలీజ్ అయిన మెగా 154 సినిమా అప్డేట్ అంటూ తెలుస్తుంది .మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ను రేంజ్ లో ప్లాన్ చేసుకున్నాడు. వరుస సినిమాలతో యంగ్ హీరోస్ కి ధీటుగా తన పాపులారిటీని పెంచుకుంటున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయింది .

కాగా నేడు దివాళి సందర్భంగా మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించారు డైరెక్టర్ బాబీ. బాబీ డైరెక్షన్లో చిరంజీవి హీరో గా చేస్తున్న సినిమా టైటిల్ ని అఫీషియల్ గా ప్రకటించారు. అఫీషియల్ గా టైటిల్ అండ్ టీజర్ విడుదల చేశారు . కాగా అందరూ అనుకున్నట్టే ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అని టైటి పెట్టారు. కాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తూ ఊర మాస్ లుక్ లో ఉన్న చిరంజీవిని పరిచయం చేశారు.

మరీ ముఖ్యంగా ఈ సినిమా పోస్టర్ చూస్తే జనాలకు గతంలో మెగాస్టార్ నటించిన ముఠామేస్త్రి గుర్తుకువస్తుంది . అంతేకాదు చెవికి పోగు.. నోట్లో బీడీ ..లుంగీ ధరించిన చిరంజీవి ఊర మాస్ లుక్ లో అదరగొట్టేసాడు. కాగా ఈ సినిమా కోసం మెగాస్టార్ చేసిన పని ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. నిజానికి చిరంజీవికి స్మోకింగ్ అలవాటు లేదు కానీ కొన్ని సినిమాలు టైంలో అలాంటి రోల్స్ కోసం మిల్క్ మేడ్ సిగిరేట్స్ ని తాగేవారు .

కానీ ఈ సినిమా కోసం అలా పొగను ఊదడానికి రింగులుగా రావడానికి మెగాస్టార్ చిరంజీవి నిజంగానే స్మోకింగ్ చేశారని ఓ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు ఇలా చేయమని చెప్పింది డైరెక్టర్ బాబీనే ఆట . ఈ క్రమంలోనే బాబిని మెగా ఫాన్స్ తిట్టి పోస్తున్నారు. మా చిరంజీవి చేత ఇలాంటి పని చేయిస్తావా నువ్వు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. దీంతో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన మెగా 154 అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news