Moviesఎక్స్ క్లూజివ్ : ఆనాడు ఎన్టీఆర్ చెప్పిందే ఈనాడు నిజమైందిగా..అభిమానులు షాక్..!!

ఎక్స్ క్లూజివ్ : ఆనాడు ఎన్టీఆర్ చెప్పిందే ఈనాడు నిజమైందిగా..అభిమానులు షాక్..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అదే నయనతార బేబీ బాయ్స్. ఎవరైనా బిడ్డలకు జన్మనిచ్చారంటే చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతారు . మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి. బట్ నయనతార విషయం వచ్చేసరికి మ్యాటర్ వేరేలా ఉంది . దానికి కారణం మనందరికీ తెలిసిందే. పెళ్లయిన నాలుగు నెలలకే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి రికార్డు క్రియేట్ చేసింది నయనతార .

ఆఫ్ కోర్స్ అది సరోగసి ప్రాసెస్ అని అందరికీ తెలిసినా..పెళ్ళికి ముందే ఇలా ఎలా చేయగలరు అంటూ కొందరు ఫాన్స్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నయనతార పిల్లలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. మనకు తెలిసిందే నయనతార టాలీవుడ్ యంగ్ హీరో తారక్ తో కలిసి అదుర్స్ అనే సినిమాలో నటించింది . ఈ సినిమాలో వీళ్ళిద్దరికీ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. చారిగా తారక్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు . అయితే ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య స్విమ్మింగ్ పూల్ దగ్గర ఓ సీన్ ఉంటుంది అందరికీ గుర్తొచ్చిందా…!!

ఈ సీన్లో నయనతార ఫ్రెండ్ తో బెట్ వేసి స్విమ్మింగ్ పూల్ లో కి దూకగా ఎన్టీఆర్ సూసైడ్ చేసుకోబోతుందని కష్టపడి తన ప్రాణాలకు తెగించి కాపాడుతాడు. అయితే అది బెట్ అనే సంగతి తారక్ కి తెలియదు. ఈ క్రమంలోనే తారక్ నయనతార మధ్య వచ్చేసి సీన్లో.. మీకు కవల పిల్లలు పుడతారండి.. మీకు అక్కడ పుట్టుమచ్చ ఉంది అని చెప్పుకొస్తాడు . దీంతో వెంటనే నయనతార షాక్ అయిపోయాయి ఛీ ఛీ అంటూ సీన్ కట్ చేస్తుంది. ఆనాడు ఎన్టీఆర్ చెప్పినట్టే నిజంగా నయనతారకు కవల పిల్లలు పుట్టారు . ఈ కో ఇన్సిడెన్స్ ఏంటో అద్భుతంగా ఉంది కదూ అంటూ కొందరు ఫ్యాన్స్ ఆ వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే నయనతార విగ్నేష్ చేసిన ఈ పని అభిమానులకు నవ్వాలో ఏడవాలో తెలియని అయోమయ పరిస్థితిని క్రియేట్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news