Moviesతల్లయ్యాక అందం కోసం ప్రణిత చెత్త పని..ఆ ఆరాటమంతా అందుకేనా..?

తల్లయ్యాక అందం కోసం ప్రణిత చెత్త పని..ఆ ఆరాటమంతా అందుకేనా..?

ఈ గ్లామరస్ ప్రపంచంలో గ్లామర్ గా ఉండడం ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి ముద్దుగుమ్మలే కాదు నార్మల్ స్థాయి హీరోయిన్ గా అవకాశాలు అందుకున్న అమ్మడు కూడా ఓ రేంజ్ లో అందాల ఆరబోస్తుంది .దానంతటకీ కారణం సినిమా ఇండస్ట్రీలో నాలుగు కాలాలు ఉండాలని ..నాలుగు రూపాయలు వెనకేసుకోవాలని . అయితే కొందరికి హీరోయిన్స్ ఆమోజులో తప్పుడు అడుగులు వేస్తున్నారు. కొందరు పిల్లల్ని కంటే అందం పాడైపోతుందని.. పిల్లల్ని కనడమే మానేస్తున్నారు .మరికొందరు పిల్లల్ని కన్నాక పాలిస్తే వాళ్ళ బాడీ షేప్ లో ఉండదని పిల్లలకు కన్న తల్లి పాలు ఇవ్వకుండా దూరం పెడుతుంది .

మనకు తెలిసిందే పిల్లలకు అన్నిటికన్నా బలమైనది తల్లిపాలే ఆరోగ్యానికి చాలా మంచిది . అయితే చాలామంది హీరోయిన్స్ తల్లయ్యాక పిల్లలకి పాలు ఇవ్వట్లేదు . అది అందరికీ తెలిసిందే. కాగా అలాంటి తప్పే చేస్తుందిఅత్తారింటికి దారేది ద్వారా పేరు సంపాదించుకున్న ప్రణీత. ఈ మధ్యనే పండంటి పాపకి జన్మ నిచ్చిన ఈమె అందంగా ఉండటానికి నానా తిప్పలు పడుతుందట. అయితే పెళ్లి చాలా సింపుల్గా సదాసీదాగా చేసుకున ఈ అమ్మడు.. ప్రెగ్నెన్సీ విషయం మాత్రం ధూమ్ ధామ్ అంటూ అభిమానులకు చెప్పింది .

ప్రెగ్నెంట్ అయ్యాక బేబీ బంప్ తో చేసిన ఫోటో షూట్ అన్ని వైరల్ గా మారాయి . మరీ ముఖ్యంగా బాత్ టబ్ లో స్నానం చేస్తూ బేబీ బంప్ తో చేసిన ఫోటోపై జనాలు దుమ్మెత్తి పోశారు. ఇక డెలివరీ అయ్యాక ప్రణీత సుభాష్ హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలోని ఆమె అందాల సీక్రెట్ బయటపడింది .ప్రణీత సుభాష్ తలయ్యాక కేవలం 11 రోజులకే ఫుల్ డైట్ అంటూ బాడీ ఫిట్నెస్ అంటూ కసరత్తులు మొదలు పెట్టిందట. బిడ్డను సైతం దూరం పెట్టి అందంపై కాన్సన్ట్రేషన్ చేసిందట . వాటర్ బేస్డ్ డైట్ ప్లాంట్ డైట్ ఫాలో అవుతూ బాడీని యధావిధిగా మార్చుకోవడానికి డెలివరీ తర్వాత పొట్ట లూజ్ అవ్వకుండా వ్యాయామాలు చేసినట్టు తెలుస్తుంది. డాక్టర్స్ కూడా ఇది ఇబ్బంది అని చెబుతున్నా కానీ ప్రణిత సుభాష్ వినలేదట. దీంతో తల్లయాకా ఇదే పని.. కడుపునిండా తినాలి బిడ్డకు పాలు ఇవ్వాలి ఇదే కదా ఆరోగ్యం అంటూ జనాలు అమ్మడుని ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా సరే ప్రణిత సుభాష్ తల్లయ్యాక కూడా ఇంత అందంగా ఉండడం ఓ గొప్ప ఫీలింగ్ అయినా ..కన్న బిడ్డను దూరం పెట్టడం పరమ చెత్త పని అంటూ జనాలు తిడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news