Moviesరెండో పెళ్లికి సిద్ధమైన సమంత....? అందుకోసమే వాటికి దూరం అయ్యిందా...?

రెండో పెళ్లికి సిద్ధమైన సమంత….? అందుకోసమే వాటికి దూరం అయ్యిందా…?

ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన బ్యూటీ స‌మంత‌. మొద‌టి సినిమాతోనే స‌మంత కురాళ్ల మ‌న‌సు దోచేసింది. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఈ చిత్రానికి గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌హించ‌గా నాగ‌చైత‌న్య హీరోగా న‌టించాడు. ఇక ఈ సినిమా త‌ర‌వాత టాలీవుడ్ లో స‌మంత బిజీ అయిపోయింది. మ‌హేశ్ బాబు, అల్లు అర్జున్, ప‌వ‌న్ క‌ల్యాణ్, రామ్ చ‌ర‌ణ్ ఇలా దాదాపు టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అంద‌రికీ జోడీ క‌ట్టింది. అంతే కాకుండా త‌న ఖాతాలో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌ను వేసుకుంది. అంతే కాకుండా ఓబేబీ లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల‌తో కూడా స‌మంత సూప‌ర్ హిట్స్ అందుకుంది.

ఇక ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకుంది. ఈ సిరీస్ లో బోల్డ్ గా న‌టించి ఫిదా చేసింది. ఇదిలా ఉంటే స‌మంత ఏమ్మాయ చేసావే సినిమా చేసిన సమయంలోనే చైతూతో స్నేహం ఏర్ప‌డింది. ఆ త‌ర‌వాత వీర‌ద్ద‌రి మ‌ధ్య స్నేహం పెరిగి ప్రేమ‌గా మారింది. ఇక చాలా కాలం ప్రేమించుకుని డేటింగ్ చేసిన ఈ జంట త‌మ పేరెంట్స్ ను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వీరివైవాహిక జీవితం చాలా కాలం పాటూ సాఫీగానే సాగింది. చూడ‌ముచ్చ‌టి జంటగా పేరు తెచ్చుకున్నారు. అభిమానులు ముద్దుగా వీరిని చైసామ్ అని పిలుచుకునేవారు.

కానీ అనూహ్యంగా తాము విడిపోతున్న‌ట్టు ఈ జంట అంద‌రికీ షాక్ ఇచ్చింది. నాలుగేళ్ల కాపురం త‌ర్వాత గ‌తేడాది చివ‌ర్లో ఈ జంట విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇక విడాకుల త‌ర‌వాత కూడా స‌మంత జోష్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. పుష్ప సినిమాలో ఊ అంటావా అంటూ ఐట‌మ్ సాంగ్ స్టెప్పులు వేసి కుర్రాళ్ల మ‌తిపోగొట్టింది. ఈ సాంగ్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఊపేసింది. ఇదిలా ఉంటే స‌మంత ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అవుతున్న‌ట్టుగా వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

చైతూతో విడాకుల అనంత‌రం తాను ఒంటిరిగానే ఉండాల‌ని స‌మంత నిర్ణ‌యించుకున్న‌ప్ప‌టికీ ఆమె త‌ల్లి మాత్రం ఒప్పుకోవ‌డం లేదట‌. క‌చ్చితంగా రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాల‌ని చెబుతోంద‌ట‌. దాంతో స‌మంత కూడా ఆమె మాట‌కు గౌరవం ఇస్తూ రెండో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్న‌ట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత‌వ‌ర‌కూ నిజం ఉందో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news