Moviesఓరి దేవుడో..పిల్లల కోసం అలాంటి ప్రాక్టీస్ చేస్తున్న కొత్త జంట..పిక్స్ వైరల్..!!

ఓరి దేవుడో..పిల్లల కోసం అలాంటి ప్రాక్టీస్ చేస్తున్న కొత్త జంట..పిక్స్ వైరల్..!!

రీసెంట్ గా కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ..స్టార్ హీరోయిన్ నయనతార ..కొన్నాళ్లు డేటింగ్ చేసుకొని ..ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్యనే వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట.. అప్పుడే రెండు హనీ మూన్లు కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. అంతే కాదు రీసెంట్ గా తన బర్త డే ను దుబాయిలో చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు విగ్నేశ్ శివన్.

ఈ క్రమంలోనే ఆయన స్పందిస్తూ..” నువ్వు నాతో కలిసి జరుపుకుంటున్న ఎనిమిదవ పుట్టినరోజు ఇది . ఇంకా ఇలాంటి పుట్టినరోజులు నేను నీతో మరిన్ని ఎక్కువ జరుపుకోవాలి అని కోరుకుంటున్నాను” అంటూ ప్రపంచంలోనే ఎత్తైన భవనం గా పేరున్న బుర్జా ఖలీఫ్ ముందు కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ క్రమంలోనే దుబాయిలో ఓ మాల్ లో గడిపిన సరదా క్షణాలను ఇంస్టాగ్రామ్ వేదికగా విగ్నేశ్ శివన్ షేర్ చేసుకున్నాడు . అక్కడే ఉన్న ముగ్గురు పిల్లలతో ఫోటో దిగి ఆ ఫోటోలను ఇన్స్టాల్ లో షేర్ చేస్తూ..” భవిష్యత్తు కోసం ప్రాక్టీస్ చేస్తున్నా ” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో నెటిజన్లు తమదైన స్టైల్ లో స్పందిస్తున్నారు. కొందరు ఎప్పుడో పుట్టబోయే పిల్లల కోసం ఇప్పటినుంచే ప్రాక్టీసా ..?”అంటుంటే మరి కొందరు” మీరు ఎప్పుడు ఇలాగే పిల్లలతో సరదాగా ఉండాలని కోరుకుంటున్నాం.. త్వరలోనే నయన్ గుడ్ న్యూస్ చెబుతుందని ఆశిస్తున్నామంటూ” కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి నయన్ ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news