Moviesలిప్ లాక్ ఇస్తే ఆ హీరోకే.. అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా...

లిప్ లాక్ ఇస్తే ఆ హీరోకే.. అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా బోల్డ్ కామెంట్స్..!

తమన్నా అంటే అందరికీ ఫేవరేట్ హీరోయిన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి 15 ఏళ్ళ క్రితం పరిచయమైనప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అదే తరగని అందంతో ఉంది. అందుకే, అటు కుర్ర హీరోల సరసన హీరోయిన్‌గా నటిస్తూనే ఇటు మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరోల సరసన కూడా నటిస్తూ తన క్రేజ్‌ను కాపాడుకుంటోంది. మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు దాటేస్తున్నా కూడా త‌మ‌న్నా సీనియ‌ర్ హీరోల‌కు మంచి ఆప్ష‌న్ కావ‌డంతో ఆమె కెరీర్‌కు ఇప్ప‌ట‌కీ ఢోకా లేకుండా పోతోంది.

ప్రస్తుతం తమన్నా చేతిలో చిరంజీవి, సత్యదేవ్ సినిమాలతో పాటు వెబ్ సిరీ కూడా ఉన్నాయి. ఇక యాడ్ ఫిలింస్ అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంత బిజీగా ఉన్న తమన్నా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్ కూడా చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసి హీటెక్కిస్తుంది. అయితే, తమన్నా అంటే విపరీతమైన క్రేజ్ ఉన్న ప్రేక్షకులు తనని తమ కలల‌రాణిగా భావిస్తున్నారు.

కానీ, తమన్నా మాత్రం టాలీవుడ్ రౌడీ హీరోగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండ అంటే క్రష్ అనేట్టుగా మాట్లాడి షాకిచ్చింది. తెలుగు ఓటీటీ ఆహాలో సమంత సామ్మ్ జామ్మ్ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీనికి పలువు టాలీవుడ్ స్టార్స్ గెస్టులుగా వచ్చి సందడి చేశారు. మెగాస్టార్ లాంటి వారితోనూ సమంత సందడి చేయింది. అదే షోకి మిల్కీ బ్యూటీ కూడా వచ్చింది.

ఆ సమయంలో సమంత ..మీరు గనక ఎవరికి లిప్ లాక్ ఇవ్వాల్సి వస్తే రెడీ అవుతారు అని అడిగింది. దానికి తమన్నా సిగ్గుపడుతూ .. విజయ్ దేవరకొండ అయితే ఆ తప్పు చేయడానికి కూడా నేను రెడీ అని చెప్పి షాకిచ్చింది. తమన్నా చాలా సీనియర్. అలాంటిది విజయ్ తో లిప్ లాక్ కి రెడీ అనడం చాలామందికి షాకిచ్చింది. ఈ వీడియో పాతదే అయినా ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news