Moviesమా ప్రెసిడెంట్ సార్ వెరీ నాటీ..స్టేజీ పైనే సన్నీతో అలా..!!

మా ప్రెసిడెంట్ సార్ వెరీ నాటీ..స్టేజీ పైనే సన్నీతో అలా..!!

సన్నీలియోన్ హాట్ అని తెలుసు కానీ మరి ఇంత హటా.. వామ్మో మంచి విష్టుని కూడా టెంప్ట్ చేసేస్తుందిగా అంటూ కొందరు ట్రోలర్స్. దానికి కారణం రీసెంట్ గా జిన్నా మూవీ టీజర్ ఈవెంట్ లో జరిగిన ఫన్నీ కాన్వర్జేషన్ ఇంతకీ ఏమైందో తెలుసా….


టాలీవుడ్ స్టార్ మోహన్ బాబు పెద్ద కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన మంచు విష్ణు హీరోగా అందాల భామ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా జిన్నా. ఈ సినిమాలో సన్నీలియోన్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనుంది. నిజానికి సన్నీలియోన్ ఈ సినిమాలో కనిపిస్తుంది అని తెలియగానే సినిమాకి బోలెడంత క్రేజ్ వచ్చింది. అంతేకాదు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి మించిన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సన్నీలియోన్ . ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ టైంలో సన్నీతో మంచు విష్ణు గడిపిన ఫన్నీ సీన్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నే మారాయి.


కాగా రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీ చేసారు మేకర్స్. ఈ ఈవెంట్లో సన్నీలియోన్ మంచు విష్ణు పాల్గొని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు .కాగా ఈవెంట్ మొత్తానికి హైలైట్ గా మారింది సన్నీలియోన్. ఈ క్రమంలోనే మంచు విష్ణు కన్నా సన్నీలియోన్ ఎక్కువ ప్రశ్నలు అడగడానికి ఇంట్రెస్ట్ చూపారు రిపోర్టర్స్. ఈ క్రమంలోనే “ఈ కథ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏమైనా ఉందా ..?”అని అడగ్గా సన్నిలియోన్ మాట్లాడుతూ ..”అఫ్ కోర్స్ ఇది చాలా కొత్త డిఫరెంట్ కదా స్టోరీలో ట్విస్ట్ లు చాలా బాగుంటాయి “.

“ఇప్పటివరకు నేను ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీని చూడలేదు. ఇలాంటి కథను చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇక మంచి విష్ణు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు .ఆయనలో మంచి నటుడు ఉన్నారు. మంచు విష్ణు చాలా మంచి మనిషి.. అని చెప్తుండగా..మధ్యలో నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా అని సన్నీలియోన్ అడిగాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోయారు. కాగా సన్నీలియోన్ కవర్ చేస్తూ మంచు విష్ణు చాలా నాటీ.. మీకు తెలిసి ఉంటుంది కదా ..”అంటూ కవర్ చేసుకోవచ్చింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఎప్పుడు ట్రోల్ చేసే జనాలు మంచు విష్ణు ని మరింతగా ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news