Moviesరాశి ఉసురే ఈ డైరెక్టర్ పాలిట శాపంగా మారిందా.. అంత మోసం...

రాశి ఉసురే ఈ డైరెక్టర్ పాలిట శాపంగా మారిందా.. అంత మోసం చేసాడా..?

అందాల తార ..అలనాటి హీరోయిన్.. బొద్దుగుమ్మ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతో తన నటనతో తన స్టైల్ తో తన వాక్చాతుర్యంతో తన కళ్లతోనే ఎక్స్ప్రెషన్స్ పలికించే ఈ అమ్మడు అంటే ఇప్పటి హీరోలకి కూడా చాలా ఇష్టం. అప్పట్లో సినీ ఇండస్ట్రీని తన అంద చందాలతో ఓ ఊపు ఊపేసిన రాసి ప్రజెంట్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను బిజీగా మల్చుకుంది. పలు సీరియల్స్ లో నటిస్తూనే సినిమాలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సూపర్ హిట్స్ అందుకోవడానికి కష్టపడుతుంది.

కాగా రాశి తన సినీ కెరియర్లో బోలెడన్ని సినిమాల్లో నటించింది. నటించిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాలు సూపర్ హిట్ గానే నిలిచాయి . ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినా దాంట్లో రాశి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో సినీ ఇండస్ట్రీకి వచ్చిన అది తక్కువ కాలంలోనే హిట్ హీరోయిన్ గా రాశి పేరు టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. అయితే తెలుసో తెలియకో రాశి చేసిన ఓ తప్పు తన అభిమానులను బాధపెట్టింది.

మనకు తెలిసిందే రాశి హీరోయిన్గా చేస్తూనే కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ ..కొన్ని వల్గర్ రోల్స్ చేసి తన పరువు తానే తీసుకుంది. అయితే మరీ ముఖ్యంగా అందరికీ ఆమె “నిజం” సినిమాలో గోపీచంద్ తో చేసిన రొమాన్స్.. ఆ హాట్ రోల్ నచ్చలేదు. ఎందుకు రాశి ఇలా చేసిందా అంటూ ప్రశ్నించేలా చేసుకుంది. దీనిపై ఇప్పటికే రాశి క్లారిటీ ఇచ్చింది.

“తనకు డైరెక్టర్ తేజ కథ చెప్పేటప్పుడు ఒకలా చెప్పాడని సినిమా తెరకెక్కించేటప్పుడు మరోలా తీశాడని.. ఎడిటింగ్ లో మొత్తం తీసేసారని.. ఆ విషయంలో తేజ నన్ను మోసం చేశాడని ..బాగా ఎమోషనల్ అయింది” అయితే ఆశ్చర్యమేంటంటే.. తేజ కెరియర్ ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉందో మనకు తెలిసిందే. దీంతో రాశి ఉసురు వల్లే తేజ కెరియర్ నాశనమైంది అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు . ఏదేమైనా ఆడదాన్ని ఏడిపించిన ఉసురు ఊరికే పోదు కదా అని పెద్దవాళ్ళు చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news