Moviesఅన‌సూయ‌పై ఇండ‌స్ట్రీలో కుట్ర... ఆమె చుట్టూ ఇంత జ‌రుగుతోందా...!

అన‌సూయ‌పై ఇండ‌స్ట్రీలో కుట్ర… ఆమె చుట్టూ ఇంత జ‌రుగుతోందా…!

ప్రముఖ తెలుగు యాంకర్.. నటి అనసూయ భరద్వాజ్ కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అన‌సూయ పేరు చెపితే గ‌త ప‌దేళ్లుగా కుర్ర‌కారు మాంచి కిక్‌తో ఊగిపోతోంది. పెళ్ల‌య్యి ఇద్ద‌రు పిల్ల‌లు ఉండి కూడా అన‌సూయ హాట్‌నెస్ విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌దు. న‌డి వ‌య‌స్సు దాటేస్తున్నా కూడా ఆమెను ఆంటీ అని ఎవ‌రైనా పిలిస్తే తోక తొక్కిన తాచులా విరుచుకు ప‌డుతూ ఉంటుంది. ఇక సోష‌ల్ మీడియాలో త‌న‌ను ఎవ‌రైనా టార్గెట్ చేస్తే చాలు అన‌సూయ ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌దు.

త‌న‌ను విమ‌ర్శించే వాళ్ల‌కు తాను ఎప్పుడైనా బుద్ధి చెపుతాన‌ని.. తాను ఆత్మగౌర‌వం కాపాడుకునే విష‌యంలో ఎక్క‌డ‌కి అయినా వెళ‌తాన‌ని ఓపెన్‌గానే చెపుతోంది. అయితే తాజాగా అన‌సూయ కేంద్రంగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు చూస్తుంటే అన‌సూయ త‌న‌ను కావాల‌నే కొంద‌రు టార్గెట్ చేస్తున్నార‌ని వాపోతోంది. తాజాగా లైగ‌ర్ రిలీజ్ రోజున స‌మీక్ష‌ల త‌ర్వాత ఆమెను విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ చాలా గ‌ట్టిగా టార్గెట్ చేస్తూ వ‌చ్చారు.

అయితే అన‌సూయ కూడా ఈ విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేదు. చాలా ధీటుగా కౌంట‌ర్లు ఇస్తూ నిల‌బ‌డింది. ఆ త‌ర్వాత అనసూయ క్రేజ్ అసాధార‌ణంగా పెరిగిపోయింది. ఇక అన‌సూయ బుల్లితెర‌ను ఏలేయ‌డంతో పాటు వెండితెర మీద కూడా అద్భుత‌మైన ఛాన్సులు సొంతం చేసుకుంటోంది. దీంతో కొంద‌రు ఇండ‌స్ట్రీ వాళ్లే ఆమె ఎదుగుద‌ల చూసి ఓర్వ‌లేక ర‌క‌ర‌కాలుగా టార్గెట్ చేయిస్తున్నార‌న్న

గుస‌గుస‌లు ఉన్నాయి.

అందుకే ఆమె వ‌స్త్ర‌ధార‌ణ‌, వేష‌భాష‌ల విష‌యంలో ఇత‌ర యాంక‌ర్ల‌తో పోల్చి చూస్తూ కామెంట్లు చేయిస్తున్నార‌న్న చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి. కొంద‌రు అయితే ఆమె ఇమేజ్‌ను దెబ్బ కొట్టేందుకు ఆమె న‌కిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తూ హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టి నెగ‌టివ్‌గా ట్రెండ్ చేస్తున్నారు. అయితే త‌న చుట్టూ ఎంత జ‌రుగుతున్నా అన‌సూయ మాత్రం వీటిని ధైర్యంగా ఎదుర్కొంటూ తిప్పికొట్టే ప్ర‌య‌త్నం ఎప్ప‌టిక‌ప్పుడు చేస్తూనే వ‌స్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news