Moviesఅతడితోనే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్..... నిజంగా గ్రేట్ అంటూ బిందు మాధ‌వి...

అతడితోనే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్….. నిజంగా గ్రేట్ అంటూ బిందు మాధ‌వి బోల్డ్ కామెంట్స్‌…!

ఆవకాయ్ బిర్యానీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ బింధు మాదవి. మొదటి సినిమా తోనే బిందు మాధవి తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తరవాత బిందు మాధవి రామ్ హీరోగా నటించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి అలరించింది. అంతే కాకుండా నానికి జోడిగా పిల్ల జమిందార్ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఇక తెలుగు అమ్మాయి అయినప్పటికీ బిందు మాధవి ఇక్కడ కంటే తమిళ్ లో ఎక్కువ ఛాన్స్ లు దక్కించుకుంది. దాంతో అక్కడ స్టార్ హీరోయిన్ గా రాణించింది.

అంతే కాకుండా తమిళ బిగ్ బాస్‌లో అడుగుపెట్టి రన్నర్ గా నిలిచింది. ఆ తరవాత తెలుగు బిగ్ బాస్ లో సైతం అడుగుపెట్టింది. అయితే తెలుగు బిగ్ బాస్ షోలో బిందు మాధవి తన చిన్ననాటి లవ్ స్టోరీని బయటపెట్టింది. తాను ప్రతి రోజు తన తండ్రి తో కలిసి షటిల్ ఆడటానికి వెళ్ళేదాన్ని అని చెప్పింది. అయితే అక్కడ ఒక అబ్బాయి తనకు తెలియకుండా తన స్కూటీ పై ప్రతి రోజూ ఏదో ఒక గిఫ్ట్ ఉంచేవాడని తెలిపింది. ఒకరోజు రోస్ ఉంచాడని అలాగే చాక్లెట్స్ ఇంకా గిఫ్ట్స్ ఉంచాడని తెలిపింది. అలా చాలా సార్లు ఏదో ఒకటి ఉంచాడని… అలా జరగటం త‌న ప్రేమ‌లో మొదటి అనుభూతి అంటూ పేర్కొంది.

దాంతో తాను అతడిని కలవాలి అని చాలా ఆశపడినట్టు తెలిపింది. మొత్తానికి ఒకరోజు అతడిని కలిశాన‌ని.. ఆ త‌ర్వాత అత‌డు తనను రోజూ బయటకు తీసుకువెళ్ళేవాడని చెప్పింది. తాను ఊహించుకున్నవి… ..సినిమాల్లో చూసి కలలు కన్నవి అన్నీ అతడి వల్ల తన జీవితంలో జరిగాయని బింధు చెప్పింది. తనకు అన్ని అనుభవాలు అతడి వల్లే జరిగాయని చెప్పింది. అంతే కాకుండా అతడి వళ్లే తాను ఇండిపెండెంట్ గా ఉండటం కూడా నేర్చుకున్నా అంటూ వ్యాఖ్యానించింది. కానీ చాలా వరకు ఫస్ట్ లవ్ లు బ్రేకప్ అవుతాయని తన ఫస్ట్ లవ్ కూడా బ్రేకప్ అయ్యిందని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news