Moviesఆ స్టార్ హీరోయిన్ సెట్లో ఉంటే ఏఎన్నార్‌కు ఎందుకంత భ‌యం..!

ఆ స్టార్ హీరోయిన్ సెట్లో ఉంటే ఏఎన్నార్‌కు ఎందుకంత భ‌యం..!

టాలీవుడ్ లో దివంగత నటులు ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు. తెలుగు సినిమా చరిత్రకు వీరిద్దరూ రెండు కళ్ళు లాంటివారు. ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఇద్దరూ తమ కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. ఎన్టీఆర్ – ఏఎన్నార్ తో పోటీపడి నటించడం అంటే ఎంత గొప్ప హీరోయిన్‌కు అయినా ఎంతో కష్టం అయ్యేది. సావిత్రి లాంటి మహానటి సైతం ఈ ఇద్దరు హీరోల పక్కన నటించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. ఇక ఏఎన్ఆర్ కు హీరోయిన్ల ముద్దుల హీరో అన్న పేరు ఉండేది.

హీరోయిన్ల విషయంలో ఏఎన్ఆర్ ఎంతో ప్రేమతో ఉండేవారట. సెట్స్ లో సరదాగా చిలిపి పనులు చేస్తూ వారిని ఆట పట్టిస్తూ ఉండడంతో పాటు… వారిపై చమక్కులు కూడా వేసే వారట. అందుకే హీరోయిన్లు ఎన్టీఆర్ కంటే ఏఎన్ఆర్ ను ఎక్కువగా ఇష్టపడతారని అప్పట్లో టాక్ ఉండేది. ఎన్టీఆర్ సెట్ లో చాలా గంభీరంగా ఉండడంతో పాటు షూటింగ్ విషయంలో సీరియస్‌గా ఉండేవారట. ఎన్టీఆర్ సెట్స్ లో ఉంటే అక్కడ అంతా గంభీరమైన వాతావరణం నెలకొనేదట.

అదే ఏఎన్ఆర్ సెట్లో ఉంటే అక్కడంతా సందడి సందడిగా ఉండేదట. ఏఎన్ఆర్ కూడా తన కెరీర్లో ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో నటించారు జయసుధ – జయప్రద – వాణిశ్రీ – జ‌య‌చిత్ర – సావిత్రి – శ్రీవిద్య ఇలా అప్పటి తరం టాప్ హీరోయిన్లు అందరూ ఏఎన్ఆర్ తో ఆడి పాడిన వారే. అయితే స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ సెట్లో ఉంటే త‌న‌కు ఎందుకో భ‌యం ఉంటుంది అని ఏఎన్నార్ అనేవార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న తోటి సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీమోహ‌న్ చెప్పారు.

జ‌య‌సుధ‌, జ‌య‌చిత్ర‌లో ఎవ‌రు మీకు ఇష్టం అన్న ప్ర‌శ్న‌కు ముర‌ళీమోహ‌న్ స్పందిస్తూ జ‌య‌సుధే అన్నారు. జ‌య‌సుధ గొప్ప న‌ట‌న గురించి ఏఎన్నార్ చెప్పిన మాట‌ల‌ను కూడా ముర‌ళీమోహ‌న్ చెప్పారు. జ‌య‌సుధపై సింగిల్ షాట్స్ తీస్తున్న‌ప్పుడు ఆమె ఎక్స్‌ప్రెష‌న్స్ ఎలా ఇస్తుందో మ‌నం గ‌మ‌నించుకోక‌పోతే… త‌ర్వాత ఇద్ద‌రిపై తీసే కామ‌న్ షాట్స్‌లో మ‌నం ఆమెను మించేలా ఎలా ఉండాలో తెలియ‌క దెబ్బైపోతాం… జ‌య‌సుధ సెట్లో ఉంటే త‌న‌కు కాస్త భ‌యం అని చెప్ప‌డంతో పాటు ప‌రోక్షంగా ఆమె ఎంత గొప్ప న‌టో చెప్పేవార‌ట‌. జ‌య‌సుధ ఏ సీన్లో అయినా అద్భుత‌మైన ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తుంద‌ని ఏఎన్నార్ చెప్పేవార‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news