Moviesఆ ఇద్దరు చచ్చినా నా షోకి రారు..ఎందుకంటే..!?

ఆ ఇద్దరు చచ్చినా నా షోకి రారు..ఎందుకంటే..!?

కాఫీ విత్ కరణ్ షో.. ఎంత హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఆరు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో రీసెంట్ గా ఏడవ సీజన్ గ్రాండ్ గా లాంచ్ అయింది. బుల్లితెరపై ఈ షో ఓ రేంజ్ లో పాపులర్ అయింది. కాగా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ షో టాప్ ట్రెండింగ్ లో ఉంది. కాఫీ విత్ కరణ్ షో కి జనాల్లో ఎంత మంచి పేరు ఉందో అంతే నెగిటివ్ ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఎక్కువగా పర్సనల్ విషయాలు అడుగుతూ..స్టార్ సెలబ్స్ వాళ్ళ సీక్రెట్ లైఫ్ ను బయట పెట్టడానికి ట్రై చేస్తారని జనాలు అంటున్నారు.

మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కరణ్ ఎక్కువగా సెక్స్ గురించి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారని ..జనాల్లో విప్పరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. అయితే ఇలాంటి నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్న కరణ్ మాత్రం ఆ కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఎంతో మంది గొప్ప గొప్ప సెలబ్రిటీలు షోలో పాలుపంచుకుంటున్నా.. ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్ బిగ్ సెలబ్రిటీస్ అయిన ఇద్దరు మాత్రం అటెండ్ అవ్వలేదు .ఇదే విషయం రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ కు ఎదురైంది. దీంతో ఆయన ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు బాలీవుడ్ లో కొత్త అర్థాలు తీసుకొస్తుంది.

ఇంటర్వ్యూలో కరణ్ మాట్లాడుతూ..” యస్ ఇప్పటివరకు నా షో కి హీరోయిన్.. రేఖ మేడమ్.. అలాగే నా గురువు ఆదిత్య చోప్రా రాలేదు. ఆదిత్య చోప్రా గారిని నేనే రమ్మని పిలవలేదు. ఎందుకంటే ఆయన ను ప్రశ్నించే అంత ధైర్యం, తెగింపు, తెలివితేటలు, నాకు లేవు. కాబట్టి బహుశా ఈ జన్మలో నేను ఆయన్ని షోలో చూడలేను అనుకుంటాను. కానీ రేఖ మేడమ్ ను నేను చాలా సార్లు నా షో కి రమ్మని రిక్వెస్ట్ చేశాను .

ప్రతి సీజన్ కోసం స్పెషల్ గా ఆమెని ఇన్వైట్ చేశాను. కానీ ఆమె ఏ సీజన్ కి ఈ షో కి రావడానికి ఇష్టపడలేదు. బహుశా ఆమె ఏదో సీక్రెట్ దాచుతున్నట్లు ఉంది.. అది పెద్ద రహస్యం కావచ్చు..అందుకే నా షో కి వస్తే ఎక్కడ బయట పడుతుందో అని ఆమె భయపడి నా షోకి రావడానికి నో చెప్తూ ఉండొచ్చు. కాబట్టి ఇకపై నేను ఆమెను ఇబ్బంది పెట్టాలి అనుకోవడం లేదు. ఇక నేను వాళ్లని ఎప్పటికి నా షో కి రమ్మని పిలవను” అంటూ కరణ్ జోహార్ కామెంట్స్ చేసినట్లు బాలీవుడ్ మీడియా లో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news