Moviesఅదే ప్లేస్ లో ఏ పవర్ స్టారో..సూపర్ స్టారో ఉంటే..నీ నోరు...

అదే ప్లేస్ లో ఏ పవర్ స్టారో..సూపర్ స్టారో ఉంటే..నీ నోరు లేచేదా దర్శకేంద్రా..!?

యస్..ఇప్పుడు ఇదే ప్రశ్నను సూటిగా ప్రశ్నిస్తున్నారు సుధీర్ అభిమానులు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుని. మనకు తెలిసిందే ఆయన కు కొంచెం క్రమశిక్షణ ఎక్కువ. సరదాగా మాట్లాడుతాడు ..అల్లరి చేస్తారు..కానీ పని విషయానికి వచ్చే సరికి యమ స్ట్రిక్ట్. కళ్ళు పెద్దవి చేస్తే ఏ హీరో అయినా..సైలెంట్ అవ్వాల్సిందే. ఆయన డైరెక్షన్ లో సినిమాలు చేయడానికి ఎంత ఇష్టపడతారో..అంతే భయపడతారు కూడా..

శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శక‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, స‌ప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. తాజాగా వాంటెడ్ పండు గాడ్ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.

అప్పటి వరకు సరదాగా సాగిపోతున్న ఈవెంట్ లో సడెన్ గా సుడిగాలి సుధీర్ అభిమానులు అల్లరి చేశారు. అఫ్ కోర్స్ ఈవెంట్స్ అంటేనే అల్లరి..ఫ్యాన్స్ వాళ్ళు లేకపోతే ఎలా. ఇలా చాలా మంది బిగ్ స్టార్స్ ఫ్యాన్స్ కూడా..ఈవెంట్ లల్లో అల్లరి చేస్తారు. ఈ సినిమా ఈవెంటలో ను అదే జరిగింది. సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతున్న సమయంలో అభిమానులు గోల చేయడంతో ఆయన టంగ్ స్లిప్ అయ్యి..సుధీర్ అభిమానుల పై ఫైర్ అయ్యారు. వాళ్ళు నొచ్చుకునేలా కొన్ని అవమానకర వ్యాఖ్యలు చేశాడు.

“వేడుకలో అల్లరి చేయకుండా ఉంటే ఉండండి లేదంటే వెళ్లిపోండి. మిమ్మల్ని అసలు ఎవడు పిలిచాడు. గోల చేయడం ఆపకపోతే బయటికి గెంటేస్తా. పెద్ద చిన్నా అనే మర్యాద లేదా,,” అంటూ గట్టిగా అరిచారు. దీంతో సుధీర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అక్కడ సుధీర్ ఫ్యాన్స్ కాకుండా ఏ పవర్ స్టార్ ఫ్యాన్స్ కానీ..సూపర్ స్టార్ ఫ్యాన్స్ కానీ ఉంటే ఇలా నే అరిచే వాడివా నువ్వు దర్శకేంద్రా..”అంటూ మండిపడుతున్నారు. చిన్న వాళ్ళు ఎదుగుతుంటే మీ పెద్ద వాళ్ళు చూడలేరు అంటూ తిట్టిపోస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news