Moviesహీరోలు 1,2సార్లే..హీరోయిన్లు మాత్రం ఒక్కేసారి 5,6..సంచలన మ్యాటర్ ని బయటపెట్టిన రాజారవీంద్ర..!!

హీరోలు 1,2సార్లే..హీరోయిన్లు మాత్రం ఒక్కేసారి 5,6..సంచలన మ్యాటర్ ని బయటపెట్టిన రాజారవీంద్ర..!!

సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా.. తనకంటూ ఓ సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నటుడే ఈ రాజా రవీంద్ర. ఈయన పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . మొదట హీరోగా చేసి ఆ తర్వాత పెద్దగా సక్సెస్ కాలేక వచ్చిన సినిమా అవకాశాలతో సరిపెట్టుకుంటూ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. రాజా రవీంద్ర లో ఉండే గొప్ప టాలెంట్ చాలా సహజ సిద్ధంగా నటిస్తాడు. అది విలన్ గా అయిన హీరో ఫ్రెండ్ గా అయిన, పక్కింటి అంకుల్ గా అయినా ..ఎలా అయినా సరే ఆ పాత్రకు ప్రాణం పోస్తాడు రాజా రవీంద్ర.

ఇండస్ట్రీలో ఈయనకి ఉన్న పలుకుబడి ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రజెంట్ ఎవ్వరికి లేదనే చెప్పాలి. అయితే ఈయన నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు పలువురు హీరోలకి మేనేజర్ గా కూడా వర్క్ చేశాడు. తెలుగులో నిఖిల్ ,నవీన్ చంద్ర ,మంచు విష్ణు ,రాజ్ తరుణ్ ఒకప్పుడు రవితేజ లాంటి వారి యంగ్ హీరోస్ కి కూడా మేనేజర్ గా వర్క్ చేసిన ఈయన సినిమా డేట్ లను అడ్జస్ట్ చేయడంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ కొన్ని కారణాల చేత రవితేజకు ఈయనకు మధ్య మ్యాటర్ చెడింది అని.. దీంతో అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కాగా గత కొంతకాలంగా రాజా రవీంద్ర ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేశారు.

కానీ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆయనకి ఆసక్తికర విషయం ఎదురైంది. ఈ క్రమంలోనే ఆయన చెప్పిన ఆన్సర్ ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇక అసలు విషయం ఏంటంటే..” స్టార్ హీరోలు అందరికీ మేనేజర్ గా ఉన్న మీరు హీరోయిన్ల కంటే ఎందుకు అంత భయపడిపోతారు..? హీరోయిన్లు మిమ్మల్ని మేనేజర్ గా అడిగితే నో చెప్పారట.. నిజమేనా..?” అంటూ యాంకర్ అడిగాడు. దీంతో రాజా రవీంద్ర మాట్లాడుతూ..” నేను హీరోలకి మేనేజర్ గా చేసాను.. కానీ, హీరోయిన్లకి ఎందుకు చేయడం లేదంటే దానికి కారణం సౌందర్యానే.

జనరల్ గా హీరోలు రెండు మూడు సినిమాలు ఓకే చేసి అవి కంప్లీట్ అయ్యాకే మిగతా సినిమాలకు వెళ్తారు. కానీ హీరోయిన్స్ అలా కాదు ఒకేసారి ఐదు ఆరు సినిమాలు ఓకే చేస్తారు. ఒక రోజు ఇక్కడ ఉంటే రేపు చెన్నైలో ఉండాలి అలా కొన్నిసార్లు లేట్ అవుతాయి. ఫ్లైట్స్ డిలే అవుతాయి. అప్పుడు ఆ మేనేజర్ పడే కష్టాలు వర్ణాతీతం . అది నేను కళ్లారా చూశాను. ఒక సందర్భంలో సౌందర్య మేనేజర్ ఏకకాలంలో ఆమె మూడు సినిమాలు ఒప్పుకొని ఎంత ఇబ్బంది పడిందో కళ్లారా చూశాను. హిందీలో అమితాబచ్చన్ సినిమా ..తెలుగులో చిరంజీవి అన్నయ్య సినిమా.. తమిళ్ లో రజనీకాంత్ సినిమా మూడు సినిమాలను ఒకేసారి ఒకే చేసి ఆ టైంలో డేట్స్ సరిగ్గా అడ్జస్ట్ చేయలేక వాళ్ళ మేనేజర్ పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదు. అది చూశాక నేను భవిష్యత్తులో ఎప్పుడు హీరోయిన్స్ కి మేనేజర్ గా ఉండకూడదని నిర్ణయించుకున్నాను” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు దీంతో రాజా రవీంద్ర మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news