Moviesప్రభుదేవాను పెళ్లి చేసుకుంటానన్న పవన్ హీరోయిన్.... పాపం అలా జరగడటంతో...!

ప్రభుదేవాను పెళ్లి చేసుకుంటానన్న పవన్ హీరోయిన్…. పాపం అలా జరగడటంతో…!

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమ‌రం పులి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ నికీషా పటేల్. నికిషా బ్రిటీష్ – ఇండియ‌న్ దంప‌తుల సంతానం. ఆమె ఎక్కువుగా లండ‌న్‌లోనే పెరిగింది. అక్క‌డే చ‌దివి ఆ త‌ర్వాత మోడ‌లింగ్‌లోకి వ‌చ్చింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ బ్యూటీ సినిమాలు చేసింది. అయితే తెలుగులో చేసిన కొమ‌రం పులి సినిమా ఫ్లాప్ అవ్వడంతో తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ హాట్ బ్యూటీ గా తెలుగు ప్రేక్షకులకి నికీషా గుర్తుండిపోయింది. ఇక సినిమాల్లో పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా సోషల్ మీడియాలో ఈ అమ్మడికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.

అంతే కాకుండా నికీషా సూటిగా బోల్డ్ గా మాట్లాడుతూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటుంది. టాలీవుడ్ త‌ర్వాత బాలీవుడ్‌లో ఏమైనా ఛాన్సులు వస్తాయేమో అని అక్క‌డ కూడా కొద్ది రోజులు హ‌డావిడి చేసినా నికిషాను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. ఆ త‌ర్వాత లండ‌న్ వెళ్లి అక్క‌డ టాప్ ఎఫ్ఎం రేడియో ఛానెల్లో జాకీగా ప‌ని చేస్తోంది. ఇదిలా ఉంటే అప్పట్లో నికీషా పటేల్ – ప్రభుదేవాను పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు గుప్పుమన్నాయి. అంతే కాకుండా ఇద్దరూ కలిసి దిగిన ఓ సెల్ఫీ కూడా నెట్టింట వైరల్ అయింది.

ఇక ఓ ఇంటర్వ్యూలో ప్రభుదేవా పక్కన నటించే ఛాన్స్ వస్తే చేస్తారా అంటూ నికీషాకు ప్రశ్న ఎదురైంది. దానికి నికీషా ఆలోచించకుండా మీరు ప్రభుదేవా పక్కన నటిస్తావా ? అని అడుగుతున్నారు. నేను ప్రభుదేవా ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అంటూ సమాధానం ఇచ్చింది. ఆ ఆన్సర్ విన్న తర్వాత అంతా షాక్ అయ్యారు. మీడియాలో ప్రభుదేవా – నికీషా పెళ్లి అంటూ వార్తలు మొదలయ్యాయి.

దాంతో నికీషా మళ్లీ మీడియా ముందుకు వచ్చి తనకు ప్రభుదేవా మంచి ఫ్రెండ్ అని తనతో పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. అయినప్పటికీ ఈ అమ్మడికి ప్రభుదేవా అంటే క్రష్ ఉందన్న సంగతి అందరికి తెలిపోయింది. ఇదిలా ఉండగా నికీషా కెరీర్ ప్రారంభంలో క్రికెటర్ శ్రీశాంత్ తో లవ్ ఎఫైర్ నడిపించింది. ఆ తరవాత వీరిద్దరూ విడిపోయారు. ఇక ఇప్పటికీ ఈ బ్యూటీ ఒంటరిగానే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news