Moviesసీత నిర్ణయానికి మెగా హీరో ఫిదా..ఈ బిస్కెట్ బాగుందే..!?

సీత నిర్ణయానికి మెగా హీరో ఫిదా..ఈ బిస్కెట్ బాగుందే..!?

ఈ మధ్యకాలంలో ఎవరు ఊహించని విధంగా సైలెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా సీతారామం. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ లో రష్మిక మందన్నా..తరుణ్ భాస్కర్, సుమంత్ కీలకపాత్రలో నటించి వాళ్ల వాళ్ల రోల్స్ కి తగిన న్యాయం చేశారు . ఆగస్టు 5న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ కి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి.

మృణాల్ ఠాకూర్ ఎంత అందగత్తే అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కళ్ళతోనే ఆకట్టుకునే అందం.. సొట్ట పడే ఆ స్మైల్ తో ఎలాంటి వారినైనా ఫిదా చేయాల్సిందే. అయితే మృణాల్ టాగ్ కనపడని మరో అందం కూడా ఉంది. ఎలాంటి మగాడినైనా సరే ఇట్టే మాటలతో ఫిదా చేసేస్తుంది . అలా బిస్కెట్ వేసి ఇలా పడగొట్టేస్తుంది. ఇప్పుడు మెగా హీరోని సైతం ఆమె తన మాటలతో మాయ చేసి భారీ ఆఫర్ ని అందుకున్నట్టు సినీ వర్గాలలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది.

మనకు తెలిసింది మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాల్లో ఎంత హై పర్ఫామెన్స్ ఇచ్చిందో, ఒకే ఒక్క సినిమాతో బడాబడా హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టింది. కాగా ఇప్పుడు ఆ పర్ఫామెన్స్ తోనే మెగా ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది. సీతారామం కారణంగా పలు ఇంటర్వ్యూ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” తనకు రాంచరణ్ తో నటించాలని ఉందని.. అది తన కోరిక” అని చెప్పుకొచ్చింది.

అంతేనా రామ్ చరణ్ ని ఓ రేంజ్ లో పొగిడేసింది. దీంతో ఫిదా అయిన మెగా హీరో.. తన నెక్స్ట్ సినిమాల్లో మృణాల్ ఠాకూర్ కి అవకాశం ఇచ్చినట్లు సినీ వర్గాలలో వార్త వైరల్ గా మారింది. ప్రజెంట్ శంకర్ డైరెక్షన్లో ఋఛ్15తోఅనే సినిమా చేస్తున్నాడు. రాంచరణ్ ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు తో ఒక సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. అఫీషియల్ గా ప్రకటించకపోయినా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ ఫినిష్ చేసిన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన మృణాల ఠాకూర్ హీరోయిన్ గా ఎంపిక అయ్యిన్నట్లు సినీవర్గాల నుండి సమాచారం అందుతుంది . దీంతో మెగా హీరో బిస్కెట్ బాగుందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news