Movies' కార్తికేయ 2 ' ఫ‌స్ట్ షో టాక్‌... ఇండ‌స్ట్రీకి ఊపు...

‘ కార్తికేయ 2 ‘ ఫ‌స్ట్ షో టాక్‌… ఇండ‌స్ట్రీకి ఊపు తెచ్చే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌

నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్‌ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కార్తికేయ 2. గతంలో నిఖిల్ – చందు కాంబినేషన్లో వచ్చిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ అదే సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 తెరకెక్కడంతో ఈ సినిమాపై ముందు నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ – అభిషేక్ అగర్వాల్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌ కూడా కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్- ట్రైలర్లకు అనూహ్య స్పందన లభించింది.

దీంతో ఈ సినిమా గత రెండు నెలల నుంచి రిలీజ్ డేట్ ను ప్రకటించడం.. ఆ తర్వాత వాయిదాలు వేయడం జరుగుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షోలు ఓవర్సీతో పాటు పలుచోట్ల పడిపోయాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. కార్తికేయ 2 కథనం చాలా ఆసక్తికరంగా ఉందని… నిఖిల్ తన కెరీర్లో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసాడని చెబుతున్నారు.

 

అన్ని భాషలలోనూ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు. ఓవరాల్‌గా స్టోరీ బాగుందని మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమాను దర్శకుడు చందు తెరకెక్కించారని.. థ్రిల్లింగ్ మేట‌ర్ తక్కువగా ఉన్నా మంచి ప్రయత్నం చేశారని అంటున్నారు. సినిమా ఫస్ట్ అఫ్ చాలా బాగుందని, కాలభైరవ నేపథ్య సంగీతం ఇరగదీసేసాడని అసలు కథ సెకండాఫ్ నుంచి మొదలవుతుందని కొందరు చెబుతున్నారు.

ఫస్టాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందన్న అభిప్రాయాలే ఎక్కువమంది నెటిజన్లు చెబుతున్నారు, ఓవరాల్ గా చందు కథను హ్యాండిల్ చేసిన తీరు అద్భుతంగా ఉందని విజువల్స్, గ్రిప్పింగ్, నేరేషన్ థ్రిల్లింగ్‌కు గురి చేశాయని చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ సినిమాకు ప్రతి ఒక్కరు 3 కు పైనే రేటింగ్ ఇస్తున్నారు. పూర్తి రివ్యూ వస్తే కార్తికేయ 2 ఏ రేంజ్ హిట్టో తేలిపోనుంది. ఏదేమైనా ఇండస్ట్రీకి మంచి ఊపు తెచ్చే బొమ్మ ప‌డింద‌ని అంద‌రూ అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news