Moviesజూనియ‌ర్ ' ఎన్టీఆర్ - ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి ' పెళ్లి వెన‌క...

జూనియ‌ర్ ‘ ఎన్టీఆర్ – ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి ‘ పెళ్లి వెన‌క ఇంత స్టోరీ ఉందా..!

టాలీవుడ్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆరు వ‌రుస హిట్ల‌తో స్వింగ్‌లో ఉన్నాడు. వ‌రుస‌గా రెండు క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టుల‌ను లైన్లో పెట్టేశాడు. ముందుగా కొర‌టాల శివ సినిమా ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ సినిమా ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త‌న భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తితో క‌లిసి లండ‌న్ వెకేష‌న్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవ‌ల షూటింగ్‌ల‌కు గ్యాప్ రావ‌డంతో ఎన్టీఆర్ విదేశీ టూర్ల‌కు ఎక్కువుగా చెక్కేస్తున్నాడు.

ఇక ఎన్టీఆర్ – ప్ర‌ణ‌తి దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు అభయ్ రామ్ – భరత్ రామ్ ఉన్నారు. ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి పెళ్లి వెన‌కాల చాలా స్టోరీయే ఉంది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. 2011 మే 5న వివాహబంధంతో భార్య‌భ‌ర్త‌లు అయ్యారు. ప్ర‌ణ‌తి ఎవ‌రో కాదు మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మేన‌కోడలు కుమార్తె. ఇటు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త నార్నె శ్రీనివాస‌రావుకు కుమార్తె.

వీరిది ముందు నుంచి పారిశ్రామిక కుటుంబం. వీళ్ల‌కు కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉన్నాయి. హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్‌లో ఈ సంస్థ‌కు మంచి పట్టు ఉంది. ఎన్టీఆర్‌కు హ‌రికృష్ణ పెళ్లి సంబంధాలు చూస్తున్న‌ప్పుడు ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల అధినేత త‌న కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాల‌ని ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అయితే అది చంద్ర‌బాబుకు తెలిసిన వెంట‌నే ఎన్టీఆర్ బ‌య‌ట ఫ్యామిలీ అల్లుడు అవ్వ‌డం ఇష్టంలేక వెంట‌నే తాను రంగంలోకి దిగి ఈ పెళ్లి కుదిర్చార‌న్న‌దే నిజం.

వెంట‌నే త‌న మేన‌కోడలు కుమార్తె ప్ర‌ణ‌తితో ఆఘ‌మేఘాల మీద ఈ పెళ్లి సెట్ చేసేశారు. వాస్త‌వానికి ప్ర‌ణ‌తికి ఎన్టీఆర్‌తో పెళ్లి జ‌రిగే టైంకు ఆమెకు మైనార్టీ కూడా తీర‌లేద‌ని.. ఆమె వ‌య‌స్సు 17-18 మధ్య‌లో ఉంద‌న్న టాక్ కూడా వ‌చ్చింది. ఎన్టీఆర్‌కు క‌ట్నంగా కూడా కోట్లాది రూపాయ‌ల ఆస్తులే వ‌చ్చాయి. మామ నార్నే ఫ్యామిలీ వైపు నుంచి ఆర్థికంగా మంచి స‌పోర్టే ఉంది.

ఎన్టీఆర్ బావ‌మ‌రిది కూడా శ‌త‌మానం భ‌వ‌తి డైరెక్ట‌ర్ స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమాతో హీరో అవుతున్నాడు. ఇక ఇటీవ‌లే తారక్-ప్రణతి తమ 11వ వెడ్డింగ్ యానివర్సరీని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దంపతులతో కలిసి జరుపుకున్నారు. ఈ ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news