Moviesమోహ‌న్‌బాబుకే చుక్క‌లు చూపించిన హీరోయిన్‌.. ఆ గొడ‌వ‌తోనే చేయి చేసుకున్నాడా...!

మోహ‌న్‌బాబుకే చుక్క‌లు చూపించిన హీరోయిన్‌.. ఆ గొడ‌వ‌తోనే చేయి చేసుకున్నాడా…!

టాలీవుడ్ లో సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే చాలామంది భయపడతారు. మోహన్ బాబు ముక్కు సూటిమనిషి. అటువైపు ఎంత పెద్ద హీరో, ఎంత పెద్ద దర్శకుడు… నిర్మాతలు ఉన్నా కూడా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టేస్తుంటారు. ఈ విషయంలో ఆయన ఎంతమందికి శత్రువు అవుతున్నా కూడా తన తీరు మాత్రం మార్చుకోరన్న అపవాదు కూడా ఆయ‌న‌పై ఉంది. మోహన్ బాబు పక్కన ఆయన సొంత సినిమాలలో నటించే నటీనటులు చాలా క్రమశిక్షణతో ఉంటారు.

మోహన్ బాబు సినిమా షూటింగ్ జరుగుతుంది అంటే ఉదయం చెప్పిన ఎంత పెద్ద స్టార్ అయినా టైంకు కచ్చితంగా సెట్లో ఉండాల్సిందే. మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచి విష్ణు.. విష్ణు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. 2003లో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది. మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వం వహించగా… ఇస్మాయిల్ దర్బార్ మ్యూజిక్ అందించారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా అప్పట్లో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా ఉన్న సాక్షి శివానంద్ సోదరి శిల్ప శివానంద్ నటించింది. ఇదే ఆమెకు తొలి సినిమా. ఈ సినిమా షూటింగ్లో హీరోయిన్ శిల్ప శివానంద్‌ దర్శకుడిని పదేపదే ఇబ్బంది పెడుతుండడంతో షాజీ కైలాస్ చాలాసార్లు ఓపిక పట్టి మోహన్ బాబుకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు కూడా ముందు కాస్త ఓపిక పట్టిన తర్వాత శిల్ప శివానంద్ అతిగా ప్రవర్తించడంతో ఆమెపై చేయి చేసుకోవడంతోపాటు… చెంప మీద కొట్టారన్న టాక్ అప్పట్లో గట్టిగా వినిపించింది.

ఈ విషయం అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద హార్ట్ టాపిక్ గా మారింది. శిల్పా శివానంద్‌ ఇండస్ట్రీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదు. ఆమె దురుసు ప్రవర్తన వల్లే పెద్ద గొడవ జరిగిందని.. దర్శకుడు చెప్పినట్టు కాకుండా ఆమెకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుండడంతోనే మోహన్ బాబు వార్నింగ్‌ ఇచ్చారని ఆ సినిమా వర్గాలు చెప్పాయి. అయితే శిల్పా సోదరి సాక్షి శివానంద్ మోహ‌న్‌బాబుకు జోడీగా న‌టించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news