Moviesఅలా చేసినందుకు సారీ..ప్లీజ్ నన్ను క్షమించండి..!!

అలా చేసినందుకు సారీ..ప్లీజ్ నన్ను క్షమించండి..!!

యస్ ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. తన అభిమానులను క్షమించమని కోరాడు. పబ్లిక్ గా సారీ చెబుతూ సంచలన స్టేట్మెంట్ పాస్ చేశారు. దీంతో కోలీవుడ్ ప్రముఖులే కాదు టాలీవుడ్ హీరోస్.. సెలబ్రెటీస్ కూడా షాక్ అయ్యారు. ఇంతకీ విక్రమ్ పబ్లిక్ గా సారీ చెప్పాల్సినంత పని ఏం చేశాడు.. ఎవరిని హార్ట్ చేశారు,, ఇప్పుడు తెలుసుకుందాం..!!

హీరో చియాన్ విక్రమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న మూవీనే “కోబ్రా”. నిజానికి విక్రమ్ కోలీవుడ్ హీరోనే అయినా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేసి.. తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. దీంతో కోబ్రా పై తెలుగు ఆడియన్స్ కూడా భారీ స్ధాయి లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కమల్ హాసన్ తర్వాత అంత పేరు సంపాదించుకున్న హీరో విక్రమ్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కాగా కోబ్రా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విక్రమ్ తిరుచి కి వెళ్లారు.

అయితే అక్కడ ఎయిర్ పోర్ట్ లో విక్రమ్ ని చూడటానికి.. ఆయనతో సెల్ఫీ దిగడానికి.. ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి.. ఆయన అభిమానులు పైకి ఎగబడ్డారు. దీంతో పోలీసులు ఆయన అభిమానులను కంట్రోల్ చేయలేక ఫైనల్ గా లాఠి చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఓ పోలీస్ విక్రమ్ అభిమానిని కాలితో తన్నాడు . ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ ఊహించని ఘటనపై విక్రమ్ స్పందిస్తూ..చాలా బాధపడిపోయారు.

విక్రమ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సారీ చెప్పాడు . ఇంకొకసారి ఇలా జరగదు అంటూ హామీ ఇచ్చారు . “నన్ను చూసేందుకు ఇంతమంది జనాభా వచ్చారు అంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అభిమానాన్ని సంపాదించుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంతో పుణ్యం చేస్తే కానీ ఇలాంటి అభిమానం దక్కదు” అంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే ఆ పోలీసులును సస్పెండ్ చేయాలంటూ విక్రమ్ అభిమానులు ఆయనకు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news