Moviesఆపుకోలేకపోతున్నా..అలా చేయాలని ఉంది..అమలా బోల్డ్ స్టేట్ మెంట్..!

ఆపుకోలేకపోతున్నా..అలా చేయాలని ఉంది..అమలా బోల్డ్ స్టేట్ మెంట్..!

అమలా పాల్..ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. తన అంద చందాలతో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసిన బ్యూటి. హీరోయిన్స్ అన్నాక అన్ని పాత్రలు చేయాలి అంటూ.. ప్రయోగాత్మక సినిమాలకు ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్న హాట్ హీరోయిన్. తెలుగులో ‘ఆమె’ సినిమాతో బీభత్సం సృష్టించింది. అప్పట్లో ఎక్కడ చూసినా అమలాపాల్ గురించే టాక్ నడిచింది.

కోలీవుడ్ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటి.. పెళ్లైన కొంత కాలానికే విడాకులు తీసుకుని..భర్త నుండి సపరేటు గా ఉంటుంది. ఆ త్రౌవాత ఓ స్టార్ సింగర్ తో ప్రేమాయాణం నడుపుతుంది అని వార్తలు వచ్చినా..ఆ పుకార్లకు చెక్ పెట్టింది. ఇప్పుడు తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..జనాలని మెప్పిస్తుంది.

రీసెంట్ గా ఆమె నటించిన కడావర్ సినిమాను థియేటర్లో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేసి నిర్మాతల్కు షాక్ ఇచ్చింది. ఈ సినిమా డిస్నీ ప్లాస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా అమలాపాల్ మీడియాతో మాట్లాడుతూ..” ఇలాంటి సినిమాలు చేసి చేసి బోర్ కొడుతుంది. ఎక్కువ స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నా..ఎంత ట్రై చేసిన ఆపుకోలేకపోతున్నా..ఆ స్ట్రెస్ రిలీజ్ కోసం రొమాంటిక్ సినిమా లు చేయాలని ఉంది”..అంటూ చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news