Moviesపవన్ కళ్యాణ్‌ని నమ్ముకున్న ఇప్పుడు తల బాదుకుంటోన్న క్రేజీ హీరోయిన్‌..!

పవన్ కళ్యాణ్‌ని నమ్ముకున్న ఇప్పుడు తల బాదుకుంటోన్న క్రేజీ హీరోయిన్‌..!

పవన్ కళ్యాణ్‌ని నమ్ముకున్న ఇస్మార్ట్ బ్యూటీ..ఇప్పుడు తల బాదుకుంటుందా..? ప్రస్తుతం నిధి అగర్వాల్ ఇలానే ఫీలవుతుందని చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా పవన్ కళ్యాణ్ సరసన ఒక్క సినిమా చేసినా స్టార్ హీరోయిన్ అయిపోవచ్చునని గట్టి నమ్మకంతో ఉంటారు. అదే ఇస్మార్ట్ బ్యూటీ నిధీ అగర్వాల్ కూడా అనుకుంది. కానీ, అది కాస్త అలా అలా సాగుతూనే ఉంది. సవ్య సాచి, మిస్టర్ మజ్ను సినిమాలు చేసింది. అయితే, ఈ సినిమాలు నిధికి అంతగా హిట్స్ ఇవ్వకపోయినా కూడా క్రేజ్ మాత్రం తీసుకువచ్చి పెట్టాయి.

హైద‌రాబాద్‌లోని మార్వాడీ కుటుంబంలో పుట్టిన నిధికి కావాల్సినంత అందంతో పాటు హైట్ కూడా ఉండ‌డంతో చాలా మంది హీరోల ప‌క్క‌న మంచి జోడీగా సెట్ అయ్యింది. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలు ఆమెకు ఛాన్సులు ఇస్తున్నారు. తొలి రెండు సినిమాలు ప్లాప్ అయినా ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకుంది మాత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో. ఈ సినిమాలో నిధీ అందాల ఆరబోతతో అదరగొట్టింది. యూత్ ఆడియన్స్ అందరికీ వేడి పుట్టించింది.

ఈ సినిమా హిట్‌తో నిధీ ఒక్కసారిగా తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా బాగా ఆకట్టుకుంది. దాంతో బ్యాక్ టు బ్యాక్ శింబుతో ఒక సినిమా, జయం రవితో ఒక సినిమా చేసి హిట్స్ అందుకుంది. ఇలా కోలీవుడ్‌లో కూడా నిధి మంచి క్రేజ్ తెచ్చుకుంది. దాంతో ఒకేసారి పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం అందుకుంది. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వాస్తవంగా అయితే, ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది.

కానీ, పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల హరి హర వీరమల్లు అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ కాబట్టే నిధి బాగా ఆశలు పెట్టుకుంది. పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్ అవుతానని ఊహించింది. కానీ, ఇంతవరకు హరి హర వీరమల్లు షూటింగ్ సగానికి కూడా చేరలేదు. అంతేకాదు అసలు ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ పూర్తవుతుందో కూడా ఇంకాక్లారిటీ రావడం లేదు.

ఒకవైపు నిధి వీరమల్లు రిలీజ్ అయి హిట్ సాధిస్తే ఆ క్రేజ్ తనని స్కై రేంజ్‌కి తీసుకెళుతుందని ఆశగా చూస్తుంది. మరి పవన్ ఏం చేస్తాడో చూడాలి. అయితే ప‌వ‌న్ మాత్రం అస‌లు ఈ సినిమాను ఇప్ప‌ట్లో పూర్తి చేసే ఉద్దేశంలో లేన‌ట్టుగా ఉంది. మరోవైపు ఈ సినిమా సెట్స్ మీద ఉండ‌గానే వినోద‌య సిత్తం రీమేక్‌కు ఓకే చెప్పేశాడు. ఇక నిధి విష‌యానికి వ‌స్తే ఇంతకాలం ఆగినా వీరమల్లు పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ అయితే, ఆమె వెయిట్ చేసినదానికి ప్రతిఫలం దక్కుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news