Moviesత్రివిక్ర‌మ్ నిత్యామీన‌న్‌పై కోపం ఇలా తీర్చుకున్నాడా... అయినా డోన్ట్ కేర్ అందిగా...!

త్రివిక్ర‌మ్ నిత్యామీన‌న్‌పై కోపం ఇలా తీర్చుకున్నాడా… అయినా డోన్ట్ కేర్ అందిగా…!

మలయాళ బొద్దుగుమ్మ నిత్యా మీనన్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో అద్భుతమైన పర్ఫార్మర్‌గా మంచి పేరు క్రేజ్ తెచ్చుకుంది. కొన్ని పాత్రలను నిత్య మాత్రమే చేయగలదని నిరూపించుకుంది. నిత్య కూడా భాష ఏదైనా తనకి నచ్చితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేదంటే లేదు. ఎంత భారీ రెమ్యునరేషన్ ఇస్తామని మేకర్స్ ఆఫర్ చేసినా కూడా డబ్బు కోసం మనసు చంపుకొని సినిమాను ఒప్పుకోదు. కథ నచ్చాలి..అందులో తన పాత్ర బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి..వల్గారిటీ ఉండకూడదు.

ఏదో నాలుగు సీన్స్ .. ఓ రెండు పాటలు..ఇలాంటి ఫార్ములాతో ఎవరైనా వస్తే ఏమాత్రం మొహమాటం లేకుండా రిజెక్ట్‌ చేస్తుంది. తన పాత్రను కథ చెప్పినప్పుడు ఒకలా..షూటింగ్ సమయంలో ఒకలా చేస్తే గొడవ పడటానికైనా రెడీ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలలో ఓ టాక్ ఉంది. అటు వైపు ఎంత పెద్ద హీరో ఉన్నా, ఎంత పెద్ద డైరెక్ట‌ర్ అయినా నిత్య రాజీప‌డ‌దు. అలాగే ద‌ర్శ‌కులు ఇష్ట‌మొచ్చిన‌ట్లు గ్లామ‌ర్ ఒల‌క‌పోయ‌మ‌న్నా నిత్య వాళ్లు చెప్పిన దానికి త‌లూపేర‌క‌మూ కాదు.

గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సమంత హీరోయిన్‌గా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా సమయంలో ఇలాంటి సందర్భమే ఎదురైందని అప్పట్లో ప్రచారం జరిగింది. త్రివిక్ర‌మ్‌ కథ చెప్పినప్పుడు తన పాత్రను ఒకలా చెప్పి ఆ తర్వాత మార్చేసి సీన్స్ షూట్ చేయబోయారట. అది సహించని నిత్యా గురూజీని వారించి మరీ ముందు చెప్పినట్టుగా సీన్స్ చేయించిందట.

అదే సంఘటన ఇట్టీవల వచ్చిన భీమ్లా నాయక్ సినిమా విషయంలోనూ జరిగిందని..ఈ మూవీ విషయంలో కూడా త్రివిక్ర‌మ్ – నిత్యా మీనన్‌ల మధ్య గొడవ జరిగి సీనియర్ గాయనీ ఎంతో అద్భుతంగా పాడిన అంత ఇష్టం ఏందయ్యా అనే పాటను రికార్డ్ చేసి కూడా షూట్ చేయలేదట. భీమ్లా నాయక్ సినిమాకు సంగీతం ఎస్ ఎస్ థమన్. అల వైకుంఠపురములో సినిమా నుంచి ఆడియో ప్రమోషన్స్ ని చాలా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నాడు థమన్. అలా భీమ్లా నాయక్ కూడా చేశారు.

అలా ఇందులో చిత్ర గారితో నిత్య మీనన్ – పవన్ కళ్యాణ్‌ల మధ్య సాంగ్ ప్లాన్ చేశారు. దీని ప్రమోషన్స్ కూడా బాగా నిర్వహించారు. కానీ షూటింగ్ సమయంలో నిత్య – గురూజీల మధ్య గొడవ జరిగిందట. ఆ కోపంతోనే కావాలనే సినిమాలో పాటకు ప్రాధాన్యం ఉన్నా నిత్య మీద ఆ పాటను చిత్రీకరించలేదట. ఇది చిత్ర యూనిట్ అందరికీ తెలుసునని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ ఉంది. అయినా కూడా నిత్య గురూజీని డోన్ట్ కేర్ అన్న‌ట్టుగానే ఉండేదే కాని.. ఎక్క‌డా త‌గ్గేదే కాద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news