Moviesత్రివిక్రమ్ మాయ‌లో ప‌డిన క్రేజీ హీరోయిన్‌... అస్స‌లు వ‌ద‌ల‌డం లేదుగా...!

త్రివిక్రమ్ మాయ‌లో ప‌డిన క్రేజీ హీరోయిన్‌… అస్స‌లు వ‌ద‌ల‌డం లేదుగా…!

హీరోయిన్ల‌ను ఎలా చూపిస్తే స్టార్ హీరోయిన్‌గా పాపులర్ అవుతారో బాగా తెలిసిన దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ఒకరు. ఆయన సినిమాలలో హీరోయిన్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ప్రతి సినిమాలోనూ గమనించవచ్చు. రచయితగా ఉన్నప్పుడు హీరోయిన్ పాత్రను ఎంత బలంగా రాశారో దర్శకుడిగా ఉన్నప్పుడు అంతకంటే బలంగా రాస్తున్నారు.. తెరపై అంత అద్భుతంగానూ చూపిస్తున్నారు. దర్శకుడిగా చేసిన మొదటి సినిమా నువ్వే నువ్వే లో శ్రియ చాలా అందంగా ఉంటుంది. తన పాత్ర కూడా బాగా వర్కౌట్ అయింది.

అలా త్రిష, ఇలియానా, సమంత, పూజా హెగ్డేలు కూడా స్టార్ హీరోయిన్స్‌గా క్రేజ్‌ తెచ్చుకున్నారంటే ఖచ్చితంగా మాటల మాంత్రీకుడు చేతివాటం బాగా ఉంది. త‌న‌కు న‌చ్చిన హీరోయిన్ల‌ను ఆయ‌న ప‌దే ప‌దే త‌న సినిమాల్లో రిపీట్ చేస్తూ ఉంటారు. స‌మంత‌, ఇలియానా, పూజా హెగ్డేల‌ను అలాగే రిపీట్ చేస్తూ వ‌స్తున్నాడు. ఆయనతో సినిమా చేయాలని హీరోయిన్స్ అందరూ ఎంతో ఆతృతగా చూస్తుంటారు.

గురూజీకి కూడా ట్యూన్ అయితే ఆ హీరోయిన్‌ని వరుసగా తన సినిమాలలో హీరోయిన్‌గా తీసుకుంటుంటారు. ఫ్యామిలీ హీరోయిన్‌గా చూపిస్తూనే కొన్ని సీన్స్‌లో సాంగ్స్‌లో ఎంత వరకు వీలైతే అంత గ్లామర్‌గానూ చూపిస్తుంటారు. దీనికి ఉదాహరణ సమంతనే తీసుకోవచ్చు. అ.. ఆ సినిమాలో పెళ్లి చూపుల సన్నివేశంలో సమంత నడుమును చూపిస్తూ పచ్చి బూతు అర్థం వచ్చేలా డైలాగులు రాశారు. అసలు అలాంటి డైలాగులు రాసింది గురూజీనేనా అని అందరూ ఆశ్చర్యపోయిన సందర్భాలూ ఉన్నాయి.

అత్తారింటికి దారేది, అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలు హీరోయిన్స్‌కి ప్లస్ అవడంతో పాటు వాళ్లలోని అందాలను బాగా చూపించారు త్రివిక్రమ్‌. అలా ఆయన ఇచ్చిన క్రేజ్‌తో పెద్ద హీరోయిన్స్‌గా మారుతున్నారు. అందుకే, ఇప్పుడు మలయాళం బ్యూటీ సంయుక్త మీనన్ కూడా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఇక్కడ జండా పాతాలని చూస్తోంది. అందుకే, భీమ్లానాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ని అమ్మడు గట్టిగా పట్టుకుందట.

సితార ఎంటర్‌టైన్మెంట్ సంస్థలో గానీ, ఇతర సంస్థలలో గానీ మొదలయ్యే సినిమాలకు తన పేరును రికమెండ్ చేయమని పర్సనల్‌గా గురూజీని రిక్వెస్ట్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు సంయుక్త మీనన్‌కి టాలీవుడ్‌లో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి అంటే అది త్రివిక్రమ్‌ అని అంటున్నారు. దీనినిబట్టి చూస్తే ఖచ్చితంగా ఈ మలయాళ బ్యూటీ తెలుగులో స్టార్ స్టేటస్ అందుకోవడం గ్యారెంటీ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news