Moviesకీర్తి సురేష్ చేసిన సినిమాలల్లో వాళ్ళ అమ్మకు నచ్చని ఏకైక సినిమా...

కీర్తి సురేష్ చేసిన సినిమాలల్లో వాళ్ళ అమ్మకు నచ్చని ఏకైక సినిమా ఇదే..ఎందుకంటే..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటి గా పేరు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్. చూడటానికి చక్కటి రూపం..చూడగానే ఆకట్టుకునే స్మైల్..సినిమా లో కూడా చాలా పద్ధతిగా నటిస్తూ అభిమానులను సంపాదించుకుంది. కీర్త్ సురేష్ తల్లి కూడా..హీరోయిన్ అనే సంగతి మనకు తెలిసిందే. మేనక ఆమె పేరు. ఇండస్ట్రీలో కొద్ది సినిమాలే చేసినా..మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. కీర్తి సురేష్ హీరోయిన్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ తల్లి మేనకనే. ఈ విషయం ఆమె చాలా ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చింది.

కీర్తి సురేష్ ఇప్పటి వరకు బోలెడు సినిమాలో నటించింది. కానీ..చాలా తక్కువ సినిమాలే హిట్ అయ్యాయి. వాటిలో ది బెస్ట్ “మహానటి”.కీర్తి సురేష్ కెరీర్ లొ ఇక పై ఇలాంటి సినిమా చేయలేదు అనడంలో సందేహం లేదు. కీర్తి సురేష్ లో ఓ గొప్ప నటి దాగి ఉందని..ఈ మహానటి సినిమానే ప్రూవ్ చేసింది. ఈ సినిమా కి ఆమె కు అవార్డు కూడా వచ్చింది. ఆ టైంలో వాళ్ళ అమ్మాగారు చాలా సంతోషించారు. నటిగా ఆమె అవార్డు అందుకోవాలి అనుకున్నారు.

కానీ, తాను చేయలేకపోయిన పని తన కూతురు చేసి చూపించిందని ఎమోషనల్ అయ్యారు. అయితే, కీర్తి సురేష్ తన కెరీర్ లో చేసిన అన్ని సినిమాలల్లో వాళ్ల అమ్మగారికి ఓ సినిమా అంటే అస్సలు నచ్చదట. ఆ సినిమా పేరే “పెంగ్విన్”. కీర్తి సురేష్ ఈ సినిమాలో తల్లి రోల్ లో కనిపించింది. అయితే, కీర్తి సురేష్ నటన పరంగా ఈ సినిమాలో మెప్పించలేకపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. మహానటి లాంటి గొప్ప సినిమా లో నటించిన ఈమె ..ఆ తరువాత వచ్చిన పెంగ్విన్ సినిమా నటనతో మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కీర్తి నటన పెద్దగాగా నచ్చలేదు అని..తల్లి రోల్ లో ఆకట్టుకోలేకపోయింది అంటూ అప్పట్లో కామెంట్స్ వినిపించాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news