Moviesనువ్వే కావాలి హీరోయిన్ ' రీచా ' ఇండస్ట్రీలో ఆ కార‌ణంతోనే...

నువ్వే కావాలి హీరోయిన్ ‘ రీచా ‘ ఇండస్ట్రీలో ఆ కార‌ణంతోనే అడ్ర‌స్ లేకుండా పోయిందా…!

తెలుగులో లవర్ బాయ్‌గా మంచి పాపులర్ అయిన హీరో తరుణ్. చైల్డ్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారాడు. తరుణ్ ది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం. తన తల్లి ప్రముఖ సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆ రకంగా తరుణ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ఏమాత్రం కష్టపడలేదు. ఇక మొదటి సినిమా ఊహించని సక్సెస్ అందుకుంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో 100వ రోజు జరిగిన హంగామా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఓడియన్, మినీ ఓడియన్, ఓడియన్ డీలక్స్.. ఇలా మూడు థియేటర్స్‌లో నాలుగు ఆటలు ఈ సినిమానే ప్రదర్శించారు.

దీనికి కారణం కంప్లీట్ యూత్ లవ్ స్ట్రోరీ అలాగే చక్కటి ఫ్యామిలీ చిత్రం. ఇక ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రీచా. ఏజ్‌లో తరుణ్ కంటే పెద్దదైన రీచా మొదటి సినిమాలో తన పర్ఫార్మెన్స్‌తో బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత రీచాకి తెలుగులో అవకాశాలు ఆశించినంతగా రాలేదు. మొత్తంగా తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ. చిరుజల్లు, నా మనసిస్తారా లాంటి సినిమాలు చేసే అవకాశాలు అందుకుంది.

అయితే, రీచా కి నువ్వే కావాలి సినిమా రేంజ్ సక్సెస్ మాత్రం దక్కలేదు. నువ్వే కావాలి నాడు ప‌లు సెంట‌ర్ల‌లో ఏకంగా 365 రోజులు ఆడింది. నాడు ఈ సినిమాతో ఆంధ్ర‌దేశంలోని యూత్ అంతా ఊగిపోయింది. చిరుజల్లు – నా మనసిస్తారా సినిమాలు అట్టర్ ఫ్లాపయ్యాయి. చిరుజ‌ల్లు సినిమాలో ఆమె త‌న ఫ‌స్ట్ సినిమా హిట్ ఫెయిర్ త‌రుణ్‌తోనే మ‌రోసారి జోడీ క‌ట్టింది. పైగా తొలిప్రేమ లాంటి సూప‌ర్ హిట్ సినిమా నిర్మించిన జీవీజీ రాజు ఈ సినిమా నిర్మించారు.

భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన చిరుజ‌ల్లు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డ‌గా.. నా మ‌న‌సిస్తారా కూడా డిజాస్ట‌ర్ అయ్యింది. ఇదే ఒక పెద్ద మైనస్ అనుకుంటే రీచా చిన్న హీరోలకి తప్ప పెద్ద హీరోల సరసన నటించే ఫిజిక్ కాదని అందరూ అభిప్రాయపడ్డారు. ఆమె నటించిన పెద్ద హీరో అంటే ఒక్క శ్రీకాంత్ మాత్రమే. మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ఎంత కమర్షియల్‌గా వర్కౌట్ అవుతుందనే విషయాన్నే బాగా ఆలోచిస్తారు.

మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా ఆ తర్వాత అట్టర్ ఫ్లాప్స్ వచ్చి పడితే మాత్రం పట్టించుకునే నాధుడే ఉండడు. ఇక కమర్షియల్ హీరోయిన్ అంటే కొన్ని క్వాలిటీస్ తప్పని సరి. అవేవీ రీచాలో లేకపోవడమే పెద్ద మైనస్. అందుకే నాలుగు సినిమాలకి తట్టా బుట్టా సరేసుకొని వచ్చిన దారినే వెళ్లిపోయింది. ఇది రీచా విషయంలో మాత్రమే కాదు..మిగతా హీరోయిన్స్ చాలా మందిలో జరిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news