Moviesమ‌ళ్లీ టాలీవుడ్ నెంబ‌ర్ 1 ఎన్టీఆరే... పెళ్ల‌య్యి తల్లి అయినా త‌గ్గ‌ని...

మ‌ళ్లీ టాలీవుడ్ నెంబ‌ర్ 1 ఎన్టీఆరే… పెళ్ల‌య్యి తల్లి అయినా త‌గ్గ‌ని ఆ హీరోయిన్ క్రేజ్‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి టాలీవుడ్ లో తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నారు. టాలీవుడ్‌లో నెంబర్ వన్ పొజిష‌న్‌ కోసం స్టార్ హీరోల మధ్య గత కొన్నేళ్లుగా పోటీ నడుస్తూ ఉంది. అయితే ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి ఒక్క ప్లాప్ కూడా లేకుండా వరుస సూపర్ డూపర్ హిట్లతో డబుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టారు. అసలు ఇప్పుడున్న‌ స్టార్ హీరోలలో ఎవ్వరికీ కూడా కెరీర్ లో డబుల్ హ్యాట్రిక్ హిట్లు లేవు. ఇక తాజాగా త్రిపుల్ ఆర్‌ సినిమాతో అయితే ఎన్టీఆర్ ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి… నేషనల్ వైడ్‌గా సూపర్ పాపులర్ అయిపోయాడు.

ఎన్టీఆర్‌కు ఇప్పుడు టాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇటు సౌత్‌లోనూ… అటు నార్త్‌లోను భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తాజాగా ప్రముఖ జాతీయ మీడియా ఆర్ మాక్స్ ఇండియా సినీ సెలబ్రెటీల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన వారి లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ సంస్థ ప్ర‌తి నెలా స‌ర్వేలు చేస్తూ ర్యాంకులు ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. అటు బాలీవుడ్‌తో పాటు ఇటు సౌత్‌లో కూడా ఎవ‌రు టాప్ స్టార్సో ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేస్తోంది.

తాజా స‌ర్వేలో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ నెంబ‌ర్ 1గా నిలిచాడు. ఇక టాప్ – 10లో టాలీవుడ్ టాప్ హీరోల‌కు కూడా చోటు ద‌క్కింది. సీనియ‌ర్ హీరోల్లో కేవ‌లం మెగాస్టార్ చిరంజీవికి మాత్ర‌మే ఈ టాప్ – 10లో ప్లేస్ ఉంది. నెంబ‌ర్ 1లో ఎన్టీఆర్ ఉంటే, 2 ప్ర‌భాస్‌, మూడు బ‌న్నీ, 4 రామ్‌చ‌ర‌ణ్‌, 5 మ‌హేష్ ఉన్నారు. ఎందుకోగాని మ‌హేష్ ఈ ప్లేసుల్లో 1,2లో ఉండాల్సినోడు 5కు ప‌డిపోయాడు. ఇక 5 త‌ర్వాత 6 నాని, 7 ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, 8 విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్నారు. ఆ త‌ర్వాత చిరంజీవి, ర‌వితేజ కొన‌సాగారు.

ఇంత గ‌ట్టి పోటీలో ఎన్టీఆర్ నెంబ‌ర్ 1 ప్లేసులోకి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. త్రిబుల్ ఆర్‌తో పాన్ ఇండియా లెవ‌ల్లో హిట్ కొట్ట‌డ‌మే..! ఇక కేజీయ‌ఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో సినిమా సెట్ కావ‌డం కూడా ఎన్టీఆర్ క్రేజ్ పెరిగేందుకు కార‌ణ‌మైంది. ఇక హీరోయిన్ల జాబితాలో స‌మంత నెంబ‌ర్ వ‌న్ ప్లేసులో ఉంది. ఆమె ఇటీవ‌ల తెలుగులో ఎక్కువ సినిమాలు చేయ‌క‌పోయినా ఏదో ఒక విష‌యంలో వార్త‌ల్లో నిల‌వ‌డం ఆమెకు ప్ల‌స్ అయ్యింది.

ముఖ్యంగా నాగ‌చైత‌న్య విష‌యంలో ఆమె వార్త‌ల్లో ఉండ‌డంతో బాగా పాపుల‌ర్ అవుతోంది. ఇక హీరోయిన్ల‌లో పెళ్ల‌య్యి త‌ల్లి అయినా కూడా కాజ‌ల్ అగ‌ర్వాల్ 2వ స్థానంలో ఉంది. ఆ త‌ర్వాత పూజా హెగ్డే, సాయిప‌ల్ల‌వి ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news