Moviesఅమలాపాల్ విడాకుల వెన‌క ఇంత ఊహించ‌ని ట్విస్ట్ జ‌రిగిందా...!

అమలాపాల్ విడాకుల వెన‌క ఇంత ఊహించ‌ని ట్విస్ట్ జ‌రిగిందా…!

సినిమా ఇండస్ట్రీ లో పెళ్లిళ్లు చేసుకోవడం… తరవాత బోర్ కొత్తగానే విడాకులు తీసుకోవడం చాలా కామన్. పెళ్ళైన తక్కువ కాలం లోనే విడిపోయిన జంటలు చిత్రపరిశ్రమలో చాలానే ఉన్నాయి. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న అమలా పాల్ కథ కూడా అలాంటిదే. ఈ హాట్ బ్యూటీ తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ తో చాలా కాలం డేటింగ్ చేసింది. ఆ తరవాత వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే కేవలం పెళ్ళైన నాలుగేళ్లకు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే ఆ విడాకులకు కారణం ఓ స్టార్ హీరో అంటూ అప్పట్లో కోలీవుడ్ కోడై కూసింది.

ఆ హీరో మరెవరో కాదు స్టార్ హీరో ధనుష్. చూడ్డానికి బక్క ప‌లచగా కనిపించినా ధనుష్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్ల‌తో లవ్ ఎఫైర్ లు నడిపించాడు. ఈ నేపథ్యంలో భార్యకు విసుగు వచ్చి విడాకులు తీసుకుంది అంటే టాక్ కూడా ఉంది. ఇక ధనుష్ అమలా పాల్ తో కూడా ఒకప్పుడు లవ్ ఎఫైర్ నడిపించారు అని టాక్ ఉంది. ఇదిలా ఉంటే విజయ్ అమలా పాల్ ను పెళ్లి చేసుకునే ముందు మళ్లీ సినిమాల్లో నటించకూడదు అనే కండిషన్ పెట్టాడట. దానికి అమలా పాల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక పెళ్లి తరవాత విజయ్ అమలా పాల్ కలిసి మెలిసి ఉన్నారు. అలాంటి సమయంలో ధనుష్ ఎంట్రీ ఇచ్చి అమ్మ కనక్కు అనే సినిమాలో నటించే ఆఫర్ ఇచ్చాడట. ఇక అమలా పాల్ ఆ విషయాన్ని విజయ్ కి చెప్పకుండా ధనుష్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. అంతే కాకుండా వద్దన్నా వినకుండా నటించింది. దాంతో విజయ్ – అమలా పాల్ మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అవి కాస్తా గొడవలకు దారి తీయడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

దీనికి తోడు అమ‌ల పెళ్లి త‌ర్వాత న‌టించ‌డం విజ‌య్ త‌ల్లిదండ్రుల‌కు ఇష్టం లేక‌పోవ‌డంతో వారు కూడా నానా టార్చ‌ర్ పెట్టారు. ఈ బాధ‌లు, సూటిపోటి మాట‌లు అమ‌ల భ‌రించ‌లేక‌పోయింది. దీంతో విజ‌య్ అంటే ఇష్టం ఉన్నా… అత‌డు త‌ల్లిదండ్రుల‌ను క‌న్విన్స్ చేయ‌క‌పోవ‌డం కూడా న‌చ్చ‌లేదు. అలా చివ‌ర‌కు విడాకులు తీసుకోక త‌ప్ప‌లేదు.

విడాకులు తీసుకున్న‌ప్పుడు సంత‌కం చేసే టైంలో కూడా అమ‌ల కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఏడ్చేసుకుంటూ వెళ్లిపోయింది. విడాకుల త‌ర్వాత కూడా విజయ్ – అమలా పాల్ విడాకులకు కారణం ధనుష్ అని విజయ్ తండ్రి అలగప్పన్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. కానీ ఆ కామెంట్స్ ను అమలా పాల్ కండించింది. ఇక విడాకుల తర్వాత అమలా పాల్ సినిమాలతో బిజీ అవగా ఏ.ఎల్ విజయ్ రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news