MoviesBig Shocking: ఇక తెర పై నన్ను చూడలేరు.. బిగ్ బాంబ్...

Big Shocking: ఇక తెర పై నన్ను చూడలేరు.. బిగ్ బాంబ్ పేల్చిన నిత్యా మీనన్..!!

హీరోయిన్ నిత్యా మీనన్ ని సినిమా ఇందస్ట్రీకి దూరం అవుతున్నారా అంటే అవుననే చెప్పాలి. బొద్దుగా ఉండే ఈ క్యూట్ బేబీ..నేచురల్ యాక్టింగ్ తో తన దైన స్టైల్ లో అలరించి..నటించి మెప్పించింది. అంతేనా, బిగ్ స్టార్స్ ని కూడా తన నటన మత్తులో ముంచేసింది. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలల్లో సగంకి పైగా హీరోలు నిత్యా మీనన్ అభిమానులే. ఈ విషయాని వివిధ సంధర్భాలల్లో వాళ్ళే స్వయంగా తెలియజేశారు. అమ్మడు చెప్పుకొతగ్గ బిగ్ ప్లస్ పాయింట్ యాక్టింగ్ స్టైల్. ఆమెను తెర పై చూసిన ఎవ్వరైన సరే..తన యాక్టింగ్ స్టైల్ ను మెచ్చుకోకుండా ఉండలేరు.

 

అలా మొదలైంది సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటి.. ఆ తరువాత తన కు వచ్చిన ఆఫర్లల్లో నచ్చిన వాటిని చూస్ చేసుకుంటు,,తనదైన యాక్టింగ్ స్టైల్ తో మెప్పించింది. లాస్ట్ గా మోడ్రెన్ హైదరబాద్ అనే వెబ్ సిరీస్ తో జనాల్ను పలకరించిన ఈమె..అందులోను యాక్టింగ్ లో ఇరగదీసింది. శభాస్ నిత్యా నువ్వు సూపర్ అంటూ ప్రశంసలు అందుకుంది. జనాల్లో మంచి పేరు సంపాదించుకుంది. హమ్మయ్య ఇక నిత్యా కు ఏం ప్రాబ్లమ్ లేదు బిగ్ స్టార్స్ ఆఫర్స్ అందుకుంటుంది అని అనుకునే లోపే బిగ్ బాంబ్ పేల్చింది. కొన్నాళ్లు సినిమా లకు విరామం ఇస్తున్నా అంతూ అఫిషీయల్ గా ప్రకటించింది.

ఇక తాను సినిమాలకు, నటనకు బ్రేక్‌ తీసుకుంటున్నానంటూ చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫ్యాన్స్‌ కు ఓ వీడియో రూపంలో అప్ డేట్ ఇచ్చి షాక్ ఇచ్చింది. తాజాగా అభిమానులతో ముచ్చటించిన మాలయాళి ముద్దుగుమ్మ నిత్యా ఈ సందర్భంగానే తాను సినిమాలకు బ్రేక్‌ తీసుకుంటున్నాని తెలిపింది. ఇది తాత్కాలికంగానే అంటూ కూడా చెప్పుకొచ్చింది. కంటిన్యూగా సినిమా, వెబ్‌ సిరీస్‌లు, షోలో క్షణం తీరిక లేకుండా ఉన్నాను..బాగా అలసిపోయాను..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా “అంటూ చెప్పుకొచ్చింది. ఇది పెళ్ళి కోసం కాదు అని కూడా క్లారిటీ ఇచ్చింది. దీంతో నిత్యా అభిమానులు ఫుల్ డిస్సపాయింట్ అయ్యారు. ప్లీజ్ కమ్ బ్యాక్ సూన్ అక్కా..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Nithya Menen (@nithyamenen)

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news