Moviesసోషల్ మీడియాని షేక్ చేస్తున్న బాలయ్య లీక్డ్ పిక్స్..మ మ మాస్...

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న బాలయ్య లీక్డ్ పిక్స్..మ మ మాస్ అంతే..!!

వావ్..అద్దిరిపోయింది బాలయ్య గెటప్..ఇప్పుడు ఇలానే అంటున్నారు బాలయ్య ఫోటోలు చూసిన జనాలు. మనకు తెలిసిందే, నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలకు కమిట్ అవుతూ..ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. సినిమా సినిమాకి గ్యాప్ ఇవ్వకుండ కుర్ర హీరోలకి సైతం గట్టి పోటి ఇస్తూ..టాప్ ప్లేస్ లో ఉన్నాడు. నందమూరి నట సింహం బాలయ్య ఇప్పుడు డైనమిక్ డైరెక్టర్ గోపీ చంద్ మల్లినేని దర్శకత్వంలో ఓ మాస్ మూవీ లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పిక్స్..పోస్టర్స్ జనాలను ఓ ఊపు ఊపేసింది.

ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ ఆలంపూర్ లో జరుగుతోంది. కాగా, అక్కడ షూటింగ్ లొకేషన్ నుంచి బాలకృష్ణ కొన్ని పిక్స్ నెట్టింట లీక్ అయ్యాయి. ఆ పిక్స్ బాలయ్య గర్జించే సిం హం లా కనిపిస్తున్నాడు . ఫుల్ వైట్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో ,,మాస్ లుక్ లో ..అచ్చం సమర సింహా రెడ్డి స్టైల్ లో కనిపిస్తున్నాడు. ఇక బాలయ్య సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న జనాలు అక్కడకి చాలా మంది తరలి వచ్చారు. బాలయ్య ను చూడాలని చుట్టు పక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చారు. బాలయ్య వాళ్లతో కాసేపు సరదాగా ముచ్చటించారు.

లీకైన పిక్స్ లో బాలయ్య మాస్ లుక్ లో అదరగొడుతున్నారు. బాలయ్య బ్రేక్ సమయంలో ఫోన్ మాట్లాడుతూ బ్రేక్ ఫాస్ట్ తినే ఫోటో కూడా లీక్ అయ్యింది. బాలయ్య షూటింగ్ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ డాటర్ శృతి హాసన్ నటిస్తుంటే…మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుంది. ఈ సినిమా ని డిసెంబరు ఆఖరి నాటికి విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఖచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news