Moviesఆ ఒక్క సినిమా చేసుంటే..ఎప్పుడో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయుండేదాని..!!

ఆ ఒక్క సినిమా చేసుంటే..ఎప్పుడో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయుండేదాని..!!

లావణ్య త్రిపాఠి.. అందాల ముద్దుగుమ్మ కాదు కాదు..ఓ అందాల రాక్షసి. హీరోయిన్ గా అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చూడటానికి చక్కటి అందం..అంతకంటే ఆమె పేరు తలుచుకోగానే గుర్తువచ్చే స్మైల్..నవ్వితే పడే ఆ సొట్ట..అబ్బో..అమ్మడి అందాలకు భీబత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. తన నవ్వుతోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడ్డేసి…మంచి మంచి ఆఫర్లు అందుకుంటుంది. కానీ, ఏం లాభం పలు సినిమాల్లో నటించినప్పటికి పెద్దగా గుర్తింపు రాలేదు.

అయితే నాని మారుతి కాంబినేషన్‌లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా మాత్రం ఈ అమ్మడుకి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమాలో అమ్మడు నటన అదుర్స్. ఆ తర్వాత నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో కూడా తన అందంతో,,నటనతో అందరిని మెప్పించి..శభాష్ అని అనిపించుకుందే కానీ..స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లోకి వెళ్లలేకపోయింది.

కెరియర్ స్టార్టింగ్ లో మంచి మంచి సినిమాల్లో అవకాశాలు కొట్టేసి టాప్ లిస్టులో చేరిపోయినా..స్టార్ హీరోయిన్ స్టేటస్ కి మాత్రం దూరంగానే ఉంది. భవిష్యత్తులో వస్తుందా ..? అంటే అది కూడా డౌటే అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హ్యాపి బర్త డే అంటూ ఓ సినిమాలో అంటించింది. ఆ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాప్రమోషన్స్ లోనే ..ఓ షాకింగ్ న్యూస్ బయటపెట్టింది.

టాలీవుడ్ సేన్సేషనల్ హిట్ గీతగోవిందం..సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మొదట ఈ సినిమలో లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా ఎంపిక చేసారట. అయితే, ఆమె ఈ సినిమాను కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేసిందట. ఒక్కవేళ ఈ సినిమా ఒప్పుకుని ఉంటే..ఇప్పుడు రష్మిక లాగా..బాలీవుడ్ , కోలీవుడ్, టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ..పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయుండేది ..పాపం ..ఏం చేద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news