Moviesఆ స్టార్ హీరోయిన్ త‌మ్ముడితో ఇలియానా పెళ్లి... అప్పుడే స‌హ‌జీవ‌నం కూడా...!

ఆ స్టార్ హీరోయిన్ త‌మ్ముడితో ఇలియానా పెళ్లి… అప్పుడే స‌హ‌జీవ‌నం కూడా…!

ఇలియానా గ‌త కొన్నేళ్లుగా సినిమాల‌ను పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోలేదు. ఆమె సినిమాల నుంచి ఎప్పుడో ఫేడ‌వుట్ అయిపోయింది. అస‌లు ఆమెను పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు. బాగా లావెక్కిపోయింది. సోష‌ల్ మీడియాలో బికినీ స్టిల్స్‌తో ద‌ర్శ‌న‌మివ్వ‌డ‌మే త‌ప్పా ఇలియ‌నా చేస్తోంది కూడా ఏం లేదు. ఇప్ప‌టికే ఆమె లైఫ్‌లో ఒక‌టి రెండు ప్రేమ‌క‌థ‌లు ఉన్నాయి. అయితే విదేశీ ఫొటో గ్రాఫ‌ర్ ఐ. ఆండ్రూతో ఆమె పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయింది.

ఇద్ద‌రూ క‌లిసి కొన్నాళ్ల పాటు డేటింగ్ కూడా చేశారు. అస‌లు ఎక్క‌డ చూసినా వీళ్లే ఉండావారు. బీచ్‌ల్లో ఇలియానా బికినీ వేస్తే ఆండ్రా ఆ స్టిల్స్ తీసేవాడు. ర‌చ్చ మామూలుగా ఉండేదే కాదు. త‌ర్వాత వీరి మ‌ధ్య గ్యాప్‌తో విడిపోయారు. ఒకానొక ద‌శ‌లో ఆండ్రూతో ఇలియానా ఫ్రెగ్నెంట్ కూడా అయ్యింద‌న్న పుకార్లు కూడా వ‌చ్చాయి. ఏదేమైనా ఆ బంధానికి బ్రేక‌ప్ ప‌డింది.

అంత‌కుముందే ఇలియానా ఓ తెలుగు సినిమా హీరోతో కూడా ప్రేమ‌లో ప‌డిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. త‌ర్వాత ఆ హీరోతో కూడా అమ్మ‌డు బ్రేక‌ప్ చెప్పేసుకుంది. ఇలా ఇలియానా ఖాతాలో ప్రేమ‌క‌థ‌ల‌కు, బ్రేక‌ప్‌లు చాలా స్పేస్ ఉంది. ఈ క్ర‌మంలోనే అమ్మ‌డు మ‌రోసారి ప్రేమ‌లో ప‌డడంతో పాటు స‌హ‌జీవ‌నం కూడా స్టార్ట్ చేసింద‌ని టాక్ ?

అయితే ఆమె తాజా స‌హ‌జీవ‌నం పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌బోతోంద‌ని తెలుస్తోంది. అయితే ఈ సారి ఈ గోవా భామ ఏకంగా ఓ స్టార్ హీరోయిన్ త‌మ్ముడితో ప్రేమ‌లో ప‌డింది. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ క‌త్రినా కైఫ్ త‌మ్ముడు సెబాస్టియ‌న్ ఇలియానా తాజా భాయ్‌ఫ్రెండ్. అతడితోనే ఆమె మూడు ముళ్లు వేయించుకోబోతోంద‌ని కూడా బీ టౌన్ టాక్ ? సెబాస్టియ‌న్ చాలా లోప్రొఫైల్ లో ఉంటాడు.

ఇప్పుడు వీళ్లిద్ద‌రు మ‌న‌సులు ఇచ్చి పుచ్చుకున్నార‌ని.. డేటింగ్లో మునిగి తేలుతున్న వీరు త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌బోతున్నార‌ని అంటున్నారు. వీరు చాలా క్లోజ్‌గా ఉన్న ఫోటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మ‌రి ఈ సారి అయినా క‌త్రినా ప్రేమ స‌క్సెస్ అవుతుందేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news