Moviesబాలయ్య ఫ్యాన్స్‌కు అంత‌గా కాలిపోతోందా... కార‌ణం ఇదే...!

బాలయ్య ఫ్యాన్స్‌కు అంత‌గా కాలిపోతోందా… కార‌ణం ఇదే…!

అందరి అభిమానులు వేరే బాలయ్య అభిమానులు వేరే. ఆయన మాదిరిగానే ప్రేమ వచ్చినా కోపం వచ్చినా మొహం మీదే చూపించేస్తారు తప్ప.. మనసులో పెట్టుకొని సాధించరు. అలాంటి వారే నిజాయితీగా ఉంటారు. నట సింహం సినిమా ప్రకటించినప్పటి నుంచి అభిమానులు పెంచుకునే అంచనాలు ఎవరూ ఊహించలేరు. జస్ట్ ఫస్ట్ లుక్ వస్తేనే దాన్ని ఎంతగా వైరల్ చేస్తున్నారో ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. అందుకే, బాలయ్య సినిమా అప్‌డేట్స్ కోసం ఆయన అభిమానులు తెగ ఆతృతగా ఎదురుచూస్తుంటారు.

బాల‌య్య ఇప్పుడు మామూలు ఫామ్‌లో లేడు. బాల‌య్య సినిమా గురించి మాత్ర‌మే కాదు.. ఆయ‌న అన్‌స్టాప‌బుల్ షో కాదు. ఆయ‌న గురించి ఏ చిన్న అప్‌డేట్ వ‌చ్చినా సోష‌ల్ మీడియాలో మోత మోగిపోతోంది. ఇక బాల‌య్య ఫ్యాన్స్ అయితే ఇప్ప‌ట్లో ప్ర‌తి రోజు ఆయ‌న గురించి ఏ అప్‌డేట్ వ‌స్తుందా ? ట్రెండ్ చేద్దాం అని క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తూ ఉంటారు. అదే గనక అప్‌డేట్స్ అనుకున్న సమయానికి ఇవ్వకపోతే వారిలో ఆవేశం తన్నుకొస్తుంది. ఉక్రోషంతో ఊగిపోతారు.

ఇప్పుడు బాలయ్య కొత్త సినిమా అప్‌డేట్స్ కూడా సరిగ్గా రాకపోవడంతో అలా నందమూరి అభిమానులు ఫీలవుతున్నారట. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్‌బీకే 107కి ఎలాంటి పవర్ ఫుల్ టైటిల్ పెట్టబోతున్నారు. పోస్టర్ డిజైన్ ఎలా ఉండబోతుందీ..ఇలా రక రకాల ఆలోచనలతో ఎదురుచూస్తున్నారు. కానీ, అభిమానులు ఆశించినంత వేగంగా బాలయ్య సినిమా అప్‌డేట్స్ రావడం లేదనేది వారి వాదన.

ఇక ఎన్‌బీకె 108 సినిమాకు సంబంధిచిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటి వరకు రానేలేదు. ఎఫ్ 3 తర్వాత దర్శకుడు అనీల్ రావిపూడి బాలయ్య హీరోగా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నారని చాలా నెలల నుంచి వార్తలు వస్తున్నాయి. ఎఫ్ 3 రిలీజ్ అయి చాలా రోజులవుతోంది. కానీ, బాలయ్య – అనిల్ రావిపూడిల సినిమాకు సబంధించిన అధికారిక ప్రకటన మాత్రం మేకర్స్ ఇవ్వడం లేదు. దీంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారట.

మరి మేకర్స్ వారిని బాధించకుండా 107 మూవీ టైటిల్ పోస్టర్‌ను, ఎన్‌బీకే 108 మూవీ అధికారిక ప్రకటనేదో కాస్త త్వ‌ర‌గా ఇచ్చేస్తే బాల‌య్య ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉంటారు. లేక‌పోతే వీళ్ల అస‌హ‌నాన్ని ఎవ్వ‌రూ ఆప‌లేరు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news