MoviesNTR: 'నరసింహుడు' సినిమాకు అమీషా పటేల్‌ను నేను తీసుకోమనలేదు..!

NTR: ‘నరసింహుడు’ సినిమాకు అమీషా పటేల్‌ను నేను తీసుకోమనలేదు..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన యాక్షన్ ఎమోషనల్ సినిమా నరసింహుడు. ఈ సినిమాను చెంగల వెంకట్రావు నిర్మించారు. అయితే, ఆయన నరసింహుడు మూవీ రిలీజ్ అయ్యాక హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మ హత్య చేసుకోవాలని ప్రయత్నించారు. దీనికి కారణం సినిమా పెద్ద డిజాస్టర్
కావడమే. అయితే, ఈ విషయంలో అందరూ ఎక్కువగా హీరోగా నటించిన ఎన్.టి.ఆర్‌నే నిందించారు. ఆయన వల్లే సినిమా ఫ్లాపయిందని కొందరు యాంటి ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. దీనికి తారక్ చాలా హర్ట్ అయ్యారు. ఎమోషనల్ అవుతూ సమాధానం కూడా చెప్పారు.

బి గోపాల్ దర్శకత్వంలో నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా.. సిమ్రాన్, సంఘవి, అంజల ఝవేరీ హీరోన్‌గా నటించిన ఫ్యాక్షన్ సినిమా సమరసింహా రెడ్డి. ఈ సినిమా ఇండియా వైడ్‌గా ఊహించని విజయాన్ని అందుకుంది. ఫ్యాక్షన్ కథాంశానికి భారీ యాక్షన్ సీన్స్, సెంటిమెంట్, ఎమోషన్స్,
లవ్ ..ఇలా అన్నీ సమపాళ్లలో దర్శకుడు బి గోపాల్ రూపొందించారు. ఈ సినిమాకు ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ పవర్ ఫుల్ డైలాగ్స్ అందించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అదించారు.

ఈ సినిమాకు ప్రతీది పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ముఖ్యంగా బాలయ్య చెప్పిన డైలాగ్స్,
ఆయన పర్ఫార్మెన్స్‌కు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. సంచలన విజయాన్ని అందుకొని నిర్మాత చెంగల వెంకట్రావుకు కాసుల వర్షం కురిపించింది. దీంతో ఆ తర్వాత సినిమాను జూనియర్ ఎన్.టి.ఆర్‌తో తీశారు. ఈ సినిమాకు మొదటిరోజే ఫ్లాప్ టాక్ వచ్చింది. అప్పటికే సినిమా బడ్కెట్ బాగా పెరిగిపోయింది. మేకింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకోవడంతో నిర్మాత అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ అయింది.

హీరోయిన్‌గా అమీషా పటేల్‌ను తీసుకున్నారు. సమీరా రెడ్డి మరో హీరోయిన్‌గా ఆర్తి అగర్వాల్ స్పెషల్ సాంగ్‌లో కనిపించారు. హీరో తర్వాత ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చింది అమీషాకే. అయితే తారకే అమీషా పటేల్‌ను తీసుకోమని చెప్పినట్టు కొందరు ప్రశించారు. అలాంటి కామెంట్స్ అన్నిటికీ తారక్ ఫైర్ అవుతూ సమాధానం చెప్పారు. నేను అమీషాను తీసుకోమని చెప్పలేదు. ఓవర్ బడ్జెట్‌కు తారక్ ఎలా కారణం అవుతాడు. దర్శకనిర్మాతలు అనుకొని ఖర్చు చేశారు. అనుకోని పరిస్థితుల్లో బడ్జెట్ పెరిగిపోయింది.

సినిమా హిట్ అవుతుందనే నేను ఒప్పుకుంటాను. అదే నమ్మకంతో దర్శకనిర్మాతలు తీస్తారు. మీకు నచ్చదని మేము ముందే ఊహించలేము కదా అంటూ గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఇక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అయినందుకు తారక్ తను తీసుకున్న రెమ్యునరేషన్‌లో దాదాపు 70 శాతం తిరిగి ఇచ్చేశారు కూడా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news