Moviesబాల‌య్య రెండు డిజాస్ట‌ర్ సినిమాలు.. నిర్మాత‌కు లాభాలు... ఆ క‌థ ఇదే...!

బాల‌య్య రెండు డిజాస్ట‌ర్ సినిమాలు.. నిర్మాత‌కు లాభాలు… ఆ క‌థ ఇదే…!

సినిమా ఇండ‌స్ట్రీలో ఎంత పెద్ద హీరోకు అయినా లాభాలు, న‌ష్టాలు అనేది కామ‌న్‌. ఒక సినిమా ఎంత సూప‌ర్ హిట్ అయినా త‌క్కువ లాభాలు తెస్తుంది. మ‌రో సినిమా ప్లాప్ అయినా.. యావ‌రేజ్ అయినా కూడా ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుంది. అది ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవ్వ‌డాన్ని బ‌ట్టే ఉంటుంది. ఇక సినిమాకు పెట్టిన పెట్టుబ‌డి, బ‌డ్జెట్‌, జ‌రిగిన ప్రి రిలీజ్ బిజినెస్‌.. ఆ సినిమాను ఎక్కువ రేట్ల‌కు అమ్మారా ? త‌క్కువ రేట్ల‌కు అమ్మారా ? ఈ లెక్క‌లు అన్ని బేరీజు వేసుకునే సినిమా లాభ‌న‌ష్టాలు అనేవి ఆధార‌ప‌డి ఉంటాయి.

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ కెరీర్‌లో హిట్లు ఉన్నాయి.. ప్లాపులు ఉన్నాయి. బాల‌య్య ప్లాపు సినిమాల‌కు కూడా మ‌రీ నిర్మాత‌లు నిండా మునిగిపోయి రోడ్ల‌మీద‌కు వ‌చ్చిన సంద‌ర్బాలు లేవు. ఇందుకు కార‌ణం బాల‌య్య మ‌రీ ఎక్కువ బ‌డ్జెట్‌.. నిర్మాత‌ల‌తో ఎక్కువ ఖ‌ర్చు పెట్టించేందుకు ఇష్ట‌ప‌డ‌రు. అలాగే త‌న వ‌యస్సును బ‌ట్టి.. సినిమాను బ‌ట్టి రెమ్యున‌రేష‌న్ తీసుకుంటూ ఉంటారు. నిర్మాత‌ల‌ను పీల్చి పిప్పి చేసేయ‌డం ఆయ‌న‌కు ముందు నుంచి ఇష్టం ఉండ‌దు.

సినిమా నేప‌థ్యం, సినిమా నిర్మాత‌ల క‌ష్ట‌న‌ష్టాలు ఆయ‌న‌కు ముందు నుంచే తెలుసు. అందుకే ఆయ‌న నిర్మాత‌ల హీరో అయ్యారు. బాల‌య్య, సీనియ‌ర్ నిర్మాత సీ క‌ళ్యాణ్ అనుబంధం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాలయ్య న‌టించిన ప‌ర‌మ‌వీర చ‌క్ర‌, రూర‌ల్, జై సింహా మూడు సినిమాలు సీ క‌ళ్యాణ్ బ్యాన‌ర్లోనే వ‌చ్చాయి. విచిత్రం ఏంటంటే ఈ మూడు సినిమాల్లో జై సింహా మిన‌హా మిగిలిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయినా కూడా అవి నిర్మాత‌కు లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ విష‌యాన్ని సీ క‌ళ్యాణ్ తాను గ‌ర్వంగా చెప్పుకుంటున్నాన‌ని మ‌రీ చెప్పారు.

2018 సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన జై సింహా గుంటూరు చిల‌క‌లూరిపేట‌, ఎమ్మిగ‌నూరు, ప్రొద్దుటూరుతో పాటు మ‌హారాష్ట్ర‌లోని షోలాపూర్‌లో కూడా 100 రోజులు ఆడింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి సినిమాకు పోటీగా వ‌చ్చి మ‌రీ జై సింహా హిట్ కొట్టింది. ఇక ప‌ర‌మ‌వీర చ‌క్ర‌, రూల‌ర్ ప్లాప్ అయినా కూడా క‌ళ్యాణ్‌కు న‌ష్టాలు రాలేద‌ట‌. ఇందుకు కార‌ణాలు కూడా ఆయ‌న తెలిపారు.

ఈ రెండు సినిమాల‌ను తాను చాలా త‌క్కువ ఖ‌ర్చుతో నిర్మించాన‌ని.. న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్ల‌తో పాటు సినిమా మేకింగ్ కాస్ట్ కూడా పెద్ద‌గా కాలేద‌ని.. అందుకే త‌న‌కు న‌ష్టాలు రాలేద‌ని మ‌రీ క‌ళ్యాణ్ చెప్పారు. ప‌ర‌మ‌వీర చ‌క్ర సింహా త‌ర్వాత దాస‌రి నారాయ‌ణ రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చింది. దాస‌రి ద‌ర్శ‌క‌త్వంలో చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ బాల‌య్య ఈ సినిమా చేశారు. సినిమా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా బాల‌య్య ఈ సినిమా చేసేందుకు ముందుకు వ‌చ్చారు. ఆయ‌న రెమ్యున‌రేష‌న్ కూడా చాలా వ‌ర‌కు త్యాగం చేశారు.

ఇక బాల‌య్య రెండు బ‌యోపిక్‌లు క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు ప్లాప్ అయ్యాక రూల‌ర్ సినిమా వ‌చ్చింది. ఈ సినిమాకు కూడా త‌క్కువ ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. శాటిలైట్స్‌, డ‌బ్బింగ్ రైట్స్ పోను రు. 10 కోట్ల‌కు పైగా షేర్ వ‌చ్చింది. సినిమాను త‌క్కువ రేట్ల‌కే అమ్మారు. అందుకే డిస్ట్రిబ్యూట‌ర్లు కాని.. ఎవ్వ‌రూ న‌ష్ట‌పోలేద‌ట‌. ఈ విష‌యాన్ని క‌ళ్యాణ్ గ‌ర్వంగా చెప్పుకున్నారు. దీనికి తోడు బాల‌య్య త‌న రేంజ్‌కు త‌గిన‌ట్టుగా నిర్మాత‌ల‌కు ఇబ్బంది లేకుండా రు. 7-10 కోట్ల మ‌ధ్య‌లో మాత్ర‌మే రెమ్యున‌రేష‌న్లు తీసుకుంటాడు.. నిర్మాత‌లకు న‌ష్టం వ‌చ్చేందుకు ఆయ‌న ఇష్ట‌ప‌డ‌రు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news