Moviesఎన్టీయార్ నిర్మాతగా రాఘవేంద్రరావు బ్లాక్ బస్టర్... ఇంట్ర‌స్టింగ్ స్టోరీ...!

ఎన్టీయార్ నిర్మాతగా రాఘవేంద్రరావు బ్లాక్ బస్టర్… ఇంట్ర‌స్టింగ్ స్టోరీ…!

ఎన్టీయార్ కి 55 ఏళ్ళు వచ్చే వరకూ ఒక రొటీన్ టైప్ హీరోయిజాన్ని మాత్రమే వెండితెర మీద చేస్తూ వచ్చారు. అయితే అప్పటికే జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. టాలీవుడ్ లో కూడా క్రిష్ణ, శోభన్ బాబు వంటి తరువాత తరం హీరోలు ముందుకు వచ్చి హిట్లు కొడుతున్న టైమ్ అది. ఇక ఎన్టీయార్ వెనకబడ్డారని అంతా అనుకున్నారు. అదే మాట ఎన్టీయార్ అంటే ఇష్టపడే నిర్మాతలు, సన్నిహితులు కూడా చూచాయగా చెప్పారని అంటారు. అయినా ఎన్టీయార్ ఎక్కడా నిరాశపడలేదు.

తనకు అచ్చివచ్చిన పౌరాణిక జానర్ ని మళ్ళీ టచ్ చేశారు. అలా 1977లో దానవీర శూరకర్ణ మూవీ తీసి రిలీజ్ చేశారు. కేవలం 46 రోజుల్లో ఈ మూవీని మొత్తం పూర్తి చేయడం అన్న గారికే చెల్లింది. తీసిన సినిమా నిడివి చూస్తే పాతిక రీళ్ళు. ఇక 1977 జనవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. అలా ఎన్టీయార్ మళ్ళీ ఫాం లోకి వచ్చేశారు.

 

ఆ టైమ్ లో కొత్త నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణ తమ సత్యచిత్ర బ్యానర్ మీద అడవిరాముడు మూవీని ఎన్టీయార్ తో తీయాలని అనుకున్నారు. ఆయన కూడా వారికి ఓకే చెప్పేశారు. డైరెక్టర్ ఎవరు అన్నదే చర్చ. ఎన్టీయార్ కి అస్థాన డైరెక్టర్లు కొందరు ఉన్నారు. వారి పేర్లు చర్చకు వస్తూండంగా అనూహ్యంగా కె రాఘవేంద్రరావు పేరు తెర మీదకు వచ్చింది. అప్పటికి ఒకటి రెండు చిన్న సినిమాలు తీసి ఉన్న కె రాఘవేంద్రరావుకి సూపర్ స్టార్ ఎన్టీయార్ ఓకే చెబుతారా అన్నది అందరికీ పెద్ద డౌట్.

కానీ అలాగే చేద్దాం బ్రదర్ అని ఎన్టీయార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అలా స్టార్ట్ అయింది అడవి రాముడు. ఆ మూవీలో కొత్త రామారావుని రాఘవేంద్రరావు చూపించారు. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏడాదికి పైగా చాలా సెంటర్లలో ఆ మూవీ ఆడింది. దాంతో కె రాఘవేంద్రరావు అంటే ఎన్టీయార్ కి మరింత గురి ఏర్పడింది. ఆ మీదట ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రెండవ సినిమా కేడీ నంబర్ వన్.అది కూడా సూపర్ హిట్. అలాగే సింహబలుడు పేరుతో జానపద చిత్రం కూడా కె రాఘవేంద్రరావు అన్న గారితో తెస్తే అది సక్సెస్ అయింది. దాంతో కె రాఘవేంద్రరావు మీద తెగ ముచ్చటపడిన అన్న గారు ఒక వింత కోరిక కోరారట. అదే తన సొంత సినిమాకు పనిచేయమని.

 

అలా వచ్చినదే డ్రైవర్ రాముడు మూవీ. ఈ సినిమాను ఎన్టీయార్ తారకరామా ఫిలింస్ బ్యానర్ మీద నిర్మించారు. ఈ మూవీ షూటింగ్ కోసం ఫస్ట్ టైమ్ విశాఖ జిల్లా అరకుకు ఎన్టీయార్ వచ్చి చాలా రోజుల పాటు గడిపారు. ఇక్కడే హీరోయిన్ జయసుధతో కలసి అన్న గారు డ్యూయెట్లు పాడారు. కొన్ని యాక్షన్ సీన్లు కూడా తీశారు. మొత్తానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని 1979 ఫిబ్రవరి 2న రిలీజ్ అయితే కలెక్షన్ల మోత మోగించింది. అలా ఎన్టీయార్ సొంత సినిమాను డైరెక్ట్ చేసి రాఘవేంద్రరావు కాసుల వర్షం కురిపించారు. దటీజ్ కేఆర్కే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news