Moviesప‌వ‌న్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్‌ను భ‌య‌పెడుతోన్న ఐరెన్‌లెగ్‌...!

ప‌వ‌న్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్‌ను భ‌య‌పెడుతోన్న ఐరెన్‌లెగ్‌…!

టాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్ల‌లో పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే ఒక‌ళ్లు. కొన్నాళ్ల పాటు వ‌రుస విజ‌యాల‌తో పూజ దూసుకుపోయింది. అగ్ర హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు అంద‌రూ కాల్షీట్ల కోసం పూజా వెంట ప‌డ‌డం ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతిలో అన్నీ క్రేజీ ప్రాజెక్టే ఉన్నాయి. అస‌లు కొద్ది నెల‌ల క్రింద‌ట వ‌ర‌కు స్టార్ హీరోలు అంద‌రూ సౌత్ టు నార్త్ పూజా వెంట ప‌డ‌డంతో ఆమె కొండెక్కి కూర్చుంది. ఒక్కో సినిమాకు రు 1.5 కోట్లు తీసుకునే పూజ ఇప్పుడు ఏకంగా రు. 3 కోట్ల‌కుపైనే డిమాండ్ చేస్తోంది.

ఒక‌ప్పుడు పూజ సినిమాలో ఉంటే బ్లాక్‌బ‌స్ట‌రే అన్న టాక్ ఉండేది. ఆమె ముగ్గురు క్రేజీ హీరోల‌తో వ‌రుస‌గా చేసిన మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. దువ్వాడ జ‌గ‌న్నాథ్ బ‌న్నీతో – ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ – మ‌ళ్లీ బ‌న్నీతో అల వైకుంఠ‌పురంలో సినిమాలు చేసి సూప‌ర్ హిట్ కొట్టింది. దీంతో పూజ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఇటీవ‌ల పూజ సీన్ రివ‌ర్స్ అయిపోయింది.

ఆమె సినిమాలో ఉంటే డిజాస్ట‌ర్ అన్న టాక్ వ‌చ్చేసింది. యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో క‌లిసి ఆమె రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమా చేసింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ అంచనాల‌తో వ‌చ్చింది. అయితే సినిమా షూటింగ్ టైంలోనే ప్ర‌భాస్‌కు, పూజాకు ఏ మాత్రం ప‌డ‌లేద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. చివ‌ర‌కు సినిమా బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అయ్యింది.

ఆ త‌ర్వాత కొద్ది రోజుల గ్యాప్‌లోనే కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన బీస్ట్ రిలీజ్ అయ్యింది. బీస్ట్‌కు నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌కుడు. బీస్ట్ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో పాటు విజ‌య్ ప‌రువు కూడా తీసేసింది. అస‌లు పూజ కెరీర్ త‌మిళ్‌లో జీవా స‌ర‌స‌న మాస్క్ సినిమాతో స్టార్ట్ అయ్యింది. మ‌ళ్లీ ఆమె స్టార్ హీరోయిన్ అయ్యాక 13 ఏళ్ల‌కు విజ‌య్‌తో న‌టిస్తే ఆ సినిమా ఘోరంగా ఫ‌ల్టీ కొట్టేసింది.

క‌ట్ చేస్తే ఇప్పుడు మెగా మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఆచార్య‌లో చెర్రీకి జోడీగా న‌టించింది. చెర్రీ – చిరు క‌లిసి న‌టించిన ఈ మ‌ల్టీస్టార‌ర్‌పై మామూలు అంచ‌నాలు లేవు. అయినా సినిమా తేడా కొట్టేసి ఘోరంగా డిజాస్ట‌ర్ అయ్యింది. నెల‌న్నర రోజుల గ్యాప్‌లో మూడు పెద్ద సినిమాల‌తో పూజ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తే మూడూ కూడా మామూలు ప్లాప్‌లు కాలేదు. దీంతో పూజ ఇప్పుడు పెద్ద ఐరెన్ లెగ్ అయిపోయిందంటున్నారు.

ఇవ‌న్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఆమె తెలుగులో క్రేజీ హీరోల ప‌క్క‌న పెద్ద సినిమాలు చేస్తోంది. ఎఫ్ 3 సినిమాలో ఆమె స్పెష‌ల్ సాంగ్ చేస్తోంది. ఇక మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ సినిమాలో ఆమే హీరోయిన్‌. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేసే భవదీయుడు భగత్ సింగ్‌లోనూ ఆమే హీరోయిన్‌. అటు ఎన్టీఆర్ – కొర‌టాల శివ సినిమాలోనూ ఆమె పేరునే ఫైన‌లైజ్ చేసేలా ఉన్నాయి. దీంతో ఈ ముగ్గురు హీరోల అభిమానులు కూడా ఈ సినిమాల‌పై ఎంతో ఆస‌క్తితో ఉన్న నేప‌థ్యంలో పూజ ఐరెన్‌లెగ్ ఎఫెక్ట్ త‌మ‌పై ఎక్క‌డ ప‌డుతుందో ? అన్న ఆందోళ‌న‌తో ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news