Moviesపెళ్లి కావాల్సిన పూజాకి ఇవి అర్ధం అవుతున్నాయా..?

పెళ్లి కావాల్సిన పూజాకి ఇవి అర్ధం అవుతున్నాయా..?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఒక్క గెలుపు కోసం నానా తంటాలు పడి పడి..ఫైనల్ గా సక్సెస్ కొట్టి.. ప్రజెంట్ టాప్ హీరోయిన్ గా రాజ్యమేలుతుంది. సినిమా పరిశ్రమలోకి ఎంటర్ అయిన తరువాత ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేయించుకున్న ఈ అమ్మడు.. అదే జనాల నోట గోల్డెన్ లెగ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది..చిన్నప్పటి నుండి పూజా హెగ్డే అంతేనట..తన వల్ల కాదు లేదు అనుకోకుండా.. తాను అనుకున్నది సాధించేంత వరకు కష్ట పడుతుందట. దాని రిజల్ట్ నే ఇప్పుడు ఈ పోజీషన్ లో నిల్చో పెట్టింది పూజాని. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తోంది.

కాగా, ఆమె లాస్ట్ నటించిన మూడు చిత్రాలు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో “రాధే శ్యాం”..కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో “బీస్ట్”..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో “ఆచార్య”..ఇలా మూడు సినిమా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుని అభిమానులను బాగా నిరాశ పరిచాయి.

కానీ, అమ్మడుకు మాత్రం స్టార్స్ నుండి అవకాశాలు అందుతూనే ఉన్నాయి. పైగా ఇండస్ట్రిల్లో బడా ప్రోడ్యూసర్ తో ఆమె మెదులుతున్న తీరు అందరికి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అవసరం ఉన్నా లేకున్నా పార్టీలు, ఫంక్షన్ ల పేరు తో ఆమెపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

రీసెంట్ గానే ఓ ఈవెంట్ లో ఇద్దరు స్టేజీ పైనే అంత చనువుగా బీ హేవ్ చేయడం..షాకింగ్ గా అనిపించింది. నిజానికి రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్స్ టైం లో ప్రభాస్ తో కూడా అంత చనువుగా ఆమె ఫోటోలు దిగలేదు. కానీ, ఇక్కడ అస్సలు ఆమె అవసరమే లేని చోటకి పిలిపించుకుని..పక్కన నిల్చుని..రాసుకుని పూసుకుని తిరగడంతో వీళ్ల మధ్య యవ్వారం తేడా గా ఉందంటున్నారు..నెటిజన్స్.

పైగా ఆమె తో సినిమాలకి కమిట్ అయిన ప్రొడ్యూసర్..ప్రస్తుతం తీసుకునేదానికంటే ఎక్కువ ఇవ్వడానికి సైన్ చేసిన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు తెగ హల్ చల్ చేస్తుంది. దీంతో పెళ్ళైన ఆ ప్రొడ్యూసర్ ఎంతకైనా వెళ్తాడు ..పెళ్లి కావాల్సిన పూజానే అన్ని అర్ధం చేసుకుని..దూరం పెడితే మంచిదంటూ ఆమె ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు. మరి చూడాలి పూజా ఏం చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news