Moviesక‌ళ్యాణ్‌రామ్‌పై స‌ముద్ర‌మంత ప్రేమ చాటుతోన్న ఎన్టీఆర్..!

క‌ళ్యాణ్‌రామ్‌పై స‌ముద్ర‌మంత ప్రేమ చాటుతోన్న ఎన్టీఆర్..!

నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ఫుల్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే తాను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు హ‌రికృష్ణ కూడా సినిమాలు చేస్తున్నాడు. అన్ని అండ‌దండ‌లు ఉన్నాయి. ఉషాకిర‌ణ్ బ్యానర్లో తొలిసినిమా వ‌చ్చింది. ఆ త‌ర్వాత అశ్వ‌నీద‌త్ బ్యాన‌ర్లో అభిమ‌న్యు. అయితే క‌ళ్యాణ్‌కు తొలి హిట్ ప‌డింది మాత్రం సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేసిన అత‌నొక్క‌డే సినిమాతోనే. రవితేజ భ‌ద్ర సినిమాకు పోటీగా వ‌చ్చిన అత‌నొక్క‌డే క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లో ఫ‌స్ట్ హిట్‌. ఆ త‌ర్వాత చాలా సార్లు క‌ళ్యాణ్ కెరీర్ ప‌డుతూ లేస్తూ వ‌చ్చింది.

క‌ళ్యాణ్ ఎక్కువుగా త‌న సొంత బ్యాన‌ర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్లోనే సినిమాలు చేసేవాడు. బ‌య‌ట నిర్మాత‌ల‌కు పెద్ద‌గా సినిమాలు చేయ‌లేదు. సొంత బ్యానర్లో చేసిన సినిమాలు అనుకున్నంత‌గా క‌లిసి రాక‌పోవ‌డంతో ఆర్థికంగా చాలా న‌ష్ట‌పోయాడు. అయితే అనిల్ రావిపూడిని డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేస్తూ క‌ళ్యాణ్ హీరోగా చేసి.. నిర్మిస్తూ తీసిన ప‌టాస్ హిట్ అవ్వ‌డం మ‌నోడికి అన్ని విధాలా క‌లిసి వ‌చ్చింది.

ఆ సినిమాతో చాలా రోజుల‌కు ఓ మంచి బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌ళ్యాణ్ ఖాతాలో ప‌డింది. అటు నిర్మాత‌గాను లాభాలు తెచ్చిపెట్టింది. ఆ సినిమా డిస్ట్రిబ్యూష‌న్ విష‌యంలో ఎన్టీఆర్ కూడా కొంద‌రు డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో మాట్లాడి చాలా హెల్ఫ్ చేశాడు. ఆ సినిమా ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ రోజునే క‌ళ్యాణ్ సోద‌రుడు జాన‌కీరామ్ మృతి చెందారు. ఆ త‌ర్వాత ర‌వితేజ‌తో కిక్ 2 సినిమా చేసి క‌ళ్యాణ్ భారీగ న‌ష్ట‌పోయాడు.

క‌ళ్యాణ్‌ను ఆర్థిక ఇబ్బందుల నుంచి గ‌ట్టెక్కించేందుకే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్లో ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా చేశాడు. ఆ సినిమాకు ఎన్టీఆర్ పెద్ద‌గా రెమ్యున‌రేష‌న్ తీసుకోలేదు. అటు త‌క్కువ బ‌డ్జెట్‌లో తీయ‌డంతో సినిమా హిట్ అవ్వ‌డంతో భారీ లాభాలు వ‌చ్చి క‌ళ్యాణ్ రామ్ టెన్ష‌న్స్ చాలా వ‌ర‌కు తీరిపోయాయి. క‌ట్ చేస్తే ఇప్పుడు త‌న అన్న‌పై ఎన్టీఆర్ మ‌రోసారి స‌ముద్ర‌మంత ప్రేమ చూపుతున్నాడు.

తాను న‌టించే 30, 31వ సినిమాల్లో క‌ళ్యాణ్‌రామ్‌ను నిర్మాణ భాగ‌స్వామిగా చేశారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాకు యువ‌సుధా ఆర్ట్స్ అధినేత‌, కొర‌టాల స‌న్నిహితుడు మిక్కిలినేని సుధాక‌ర్‌తో పాటు క‌ళ్యాణ్‌రామ్ కూడా ఓ నిర్మాత‌. ఇది త్రిబుల్ ఆర్ త‌ర్వాత పాన్ ఇండియా లెవ‌ల్లో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో సినిమా ఏ మాత్రం క్లిక్ అయినా కళ్యాణ్‌రామ్‌ను నిర్మాత‌గా వేరే లెవ‌ల్లో నిల‌బెట్టిన‌ట్టు అవుతుంది.

ఇక తాజాగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ 31 వ సినిమా పోస్ట‌ర్‌తో కూడా క‌ళ్యాణ్‌రామ్ ఓ నిర్మాత అన్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. ఆ సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా కూడా కేజీయ‌ఫ్ 2 రేంజ్‌లో స‌క్సెస్ అయితే క‌ళ్యాణ్‌రామ్‌కు మామూలు పేరు రాదు. ఇటు ఎన్టీఆర్‌, అటు క‌ళ్యాణ్ సూప‌ర్ స‌క్సెస్ ట్రాక్‌లో ఉంటారు. ఇక క‌ళ్యాణ్ న‌టించిన బింబిసార ఈ ఏడాది సెకండాఫ్ లో థియేటర్లలో విడుదల కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news