Movies'ఆచార్య ' దెబ్బ‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో అల‌జ‌డి... న‌మ్మ‌లేమంటున్నారుగా...!

‘ఆచార్య ‘ దెబ్బ‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో అల‌జ‌డి… న‌మ్మ‌లేమంటున్నారుగా…!

మెగా ఫ్యామిలీలో తండ్రి, కొడుకులు చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టించ‌డం అనేది చిరు భార్య సురేఖ‌మ్మ కోరిక‌. ఆ కోరిక‌తో పాటు మెగాభిమానుల డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆచార్య ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. టాలీవుడ్‌లోనే క్రేజీ హీరోలుగా, స్టార్ హీరోలుగా ఉన్న తండ్రి, కొడుకులు క‌లిసి న‌టిస్తుండ‌డంతో సినిమాపై రిలీజ్‌కు ముందు మామూలు అంచ‌నాలు లేవు.

 

అయితే సినిమా ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ ఉండ‌డంతో చివ‌ర్లో ఎందుకో మెగాభిమానులే ఆచార్య ప‌ట్ల నిరాస‌క్త‌త ప్ర‌ద‌ర్శించారు. క‌ట్ చేస్తే ఆచార్య‌కు ఫ‌స్ట్ షోకే డిజ‌ప్పాయింట్ టాక్ వ‌చ్చింది. సినిమా చూసి మెగాభిమానులే పెద‌వి విరిచేశారు. సినిమా ఏ మాత్రం అంచ‌నాల్లో స‌గం కూడా అందుకోలేద‌ని తేల్చేశారు. ఆచార్య ఫ‌లితం వ‌చ్చేసింది. మూడు సంవ‌త్స‌రాల నుంచి ఊరిస్తూ వ‌స్తున్నా సినిమా డిజాస్ట‌ర్ అయిపోయింది.

అయితే ఇప్పుడు ఆచార్య రిజ‌ల్ట్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌ను బాగా టెన్ష‌న్ పెట్టేస్తోంది. ఎందుకంటే కొర‌టాల శివ నెక్ట్స్ సినిమా ఎన్టీఆర్‌తోనే ఉంది. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రిబుల్ ఆర్ స‌క్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత వ‌చ్చే నెల నుంచి త‌న కెరీర్‌లో 30వ సినిమాగా తెర‌కెక్కే కొర‌టాల శివ సినిమాలో న‌టిస్తాడు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువ సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ – మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తారు. గ‌తంలో ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబినేష‌న్లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మ‌రోసారి వీరి కాంబినేష‌న్ రిపీట్ అవుతుండ‌డంతో సినిమా ఖ‌చ్చితంగా హిట్ అవుతుంద‌నే అంద‌రూ అనుకున్నారు. ఎన్టీఆర్ అభిమానుల్లోనూ అదే ధీమా ఉంది.

అయితే ఇప్పుడు ఆచార్య‌తో కొర‌టాల శివ అంచ‌నాలు అందుకోలేక‌పోవ‌డంతో ఎన్టీఆర్ అభిమానుల్లో అయితే అల‌జ‌డి మొద‌లైపోయింది. కొర‌టాల చేస్తాడ‌ని తాము ఊహించ‌లేద‌ని.. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాను ఏం చేస్తాడో ? అని కాస్త టెన్ష‌న్‌లోనే ఉన్నారు. దీనికి తోడు రాజ‌మౌళితో సినిమా చేస్తే.. ఆ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. ఆ వెంట‌నే స‌ద‌రు హీరో ఎంత మంచి డైరెక్ట‌ర్‌తో.. ఎంత మంచి సినిమా చేసినా ఆడ‌డం లేదు… స‌రిక‌దా డిజాస్ట‌ర్ అయిపోతుంద‌న్న బ్యాడ్ సెంటిమెంట్ ఉంది.

అస‌లు ప్లాప్ అన్న‌ది లేని… కొర‌టాల శివే త్రిబుల్ ఆర్ త‌ర్వాత ఆచార్య తీసి చెర్రీని దారుణంగా డిజ‌ప్పాయింట్ చేశాడు. ఇప్పుడు ఈ బ్యాడ్ సెంటిమెంట్ ప్ర‌భావం ఎన్టీఆర్‌పై ఎక్క‌డ ప‌డుతుందో ? అన్న ఆందోళ‌నే అంద‌రిని వెంటాడుతోంది. విచిత్రం ఏంటంటే త్రిబుల్ ఆర్ హీరోలు ఆ సినిమా త‌ర్వాత కొర‌టాల శివ సినిమాలోనే న‌టించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news