Moviesసెక్సీ పిక్‌తో బీచ్‌లోనే సెగ‌లు రేపుతోన్న క‌త్రినా.. వావ్ ఏం అందం...!

సెక్సీ పిక్‌తో బీచ్‌లోనే సెగ‌లు రేపుతోన్న క‌త్రినా.. వావ్ ఏం అందం…!

బాలీవుడ్ ముద్దుగుమ్మ క‌త్రినా కైఫ్ ఎట్ట‌కేల‌కు త‌న ప్రియుడు అయిన విక్కీ కౌశ‌ల్‌ను పెళ్లాడింది. అప్పుడెప్పుడో 2003లో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చాలా ప్రేమాయ‌ణాలే న‌డిపింది. అప్ప‌ట్లో క‌త్రినా అందం అంటే దేశంలో యూత్ వెర్రెక్కిపోయేది. తెలుగులోనూ క‌త్రినా వెంకీ ప‌క్క‌న మ‌ల్లేశ్వ‌రి, బాల‌య్య‌కు జోడీగా అల్ల‌రి పిడుగు సినిమాలు చేసింది. త‌ర్వాత ద‌శాబ్దం పాటు ఆమె బాలీవుడ్‌ను త‌న అంద చందాల‌తో ఊపేసింది.

ముఖ్యంగా కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ దృష్టిలో ప‌డ‌డంతో క‌త్రినా గారెల బుట్ట‌లో ప‌డిపోయింది. చాలా క్రేజీ ఆఫ‌ర్లు స‌ల్మాన్ రిక‌మెండేష‌న్‌తో ఆమెకు వ‌చ్చాయ‌నే అంటారు. చివ‌ర‌కు మూడున్నర ప‌దుల వ‌య‌స్సుకు చేరువ అయిన వేళ త‌న కంటే యేడాది చిన్నోడు అయిన విక్కీ కౌశ‌ల్‌తో ప్రేమాయ‌ణం న‌డిపి అత‌డిని పెళ్లాడింది. తాజాగా పెళ్లి త‌ర్వాత భ‌ర్త‌తో క‌లిసి క‌త్రినా మామూలు ఎంజాయ్ చేయ‌డం లేదు. ఎక్క‌డ చూసినా ఈ జంటే క‌నిపిస్తున్నారు.

తాజాగా త‌న భ‌ర్త విక్కీ కౌశ‌ల్‌తో క‌లిసి స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తూ ఆ స్విమ్మింగ్ పూల్‌కే వేడెక్కించేసింది. విక్కీ కౌశ‌ల్‌తో రొమాంటిక్ పోజుతో ఇన్‌స్టాలో ఆమె మామూలుగా అల‌జ‌డి రేప‌డం లేదు. మేక‌ప్‌లెస్‌తో ఈ దంప‌తులు ఇద్ద‌రూ కూడా సెక్సీ పోజుల‌తో సెగ‌లు రేపుతున్నారు. అస‌లు ఇది మామూలు రొమాంటిక్ పోజు కాద‌నే చెప్పాలి.

ఈ ఫొటోను క‌త్రినా త‌న ఇన్‌స్టాలో పెట్టిందో లేదో ల‌క్ష‌ల్లో లైకులు వ‌చ్చాయి. వీకెండ్‌లో ఇప్పుడు ఈ పోజు నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. క‌త్రినా మామూలుగానే త‌న ఇన్‌స్టాలో కావాల్సిన‌న్ని సెక్సీ పిక్‌లు పోస్ట్ చేస్తూ వ‌స్తోంది. క‌త్రినా బీచ్ ఫొటోలు అయితే ఏ రేంజ్‌లో వైర‌ల్ అవుతాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news