Moviesఅక్కడ చెయ్యి పెట్టాడు.. గుడ్డలు ఊడతీసి కొట్టిన కరాటే కళ్యాణి..!!

అక్కడ చెయ్యి పెట్టాడు.. గుడ్డలు ఊడతీసి కొట్టిన కరాటే కళ్యాణి..!!

ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మంచి కన్నా కూడా చెడు నే ఎక్కువ స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. మరీ ముఖ్యంగా యూట్యూబ్ వచ్చక ఈ ప్రాంక్ వీడియోలు ఎక్కువ అయిపోయాయి. అలా ప్రాంక్ వీడియో లు తీసి పాపులర్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ, అసభ్యకరంగా, వల్గర్ గా మాట్లాడుతూ.. ఆంటీలు, అమ్మాయిల దగ్గరకు వెళ్లి.. వాళ్లతో సెక్స్ గురించి మాట్లాడటం, కామ కోర్కెలు రగిల్చేలా పచ్చి బూతులు మాట్లాడి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాపులర్ అయ్యాడు శ్రీకాంత్ రెడ్డి. ఒక్కసారి యూట్యూబ్ లోకి వెళ్లి శ్రీకాంత్ రెడ్డి వీడియోలు చూస్తే మీకే అర్ధమౌతుంది.

అయితే, సినీ నటి కరాటే కళ్యాణి.. నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి అతని లాగి పెట్టి కొట్టింది. “నువ్వు, నీ చెత్త వీడియోలు.. అంటూ రప్ఫాడించింది. ఫ్రాంక్ వీడియోల్లో ఆడవాళ్లని, హిందువుల్ని అగౌరవ పరిచేలా ఉన్నాయంటూ శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి చితకబాదింది కరాటే కళ్యాణి. అంతేకాదు ఆమె అనుచరులు కూడా ఒక్కసారిగా దాడి చేయడంతో శ్రీకాంత్ రెడ్డి తిరగబడ్డాడు. దీంతో అక్కడ టెన్షన్ వాతవరణం నెలకొంది. ఇద్దరు కొట్లాడుకున్న వీడియో బయటకి రావడంతో అసలు మ్యాటర్ బయట పడింది.

కాగా, తనను కొట్టిన కరాటే కళ్యాణిని, ఆమె వెంటేసుకుని వచ్చిన అనుచరులని .. చెంప పగలగేలా కొట్టాడు శ్రీకాంత్. ఈ కొట్లాటలో కరాటే కళ్యాణి చేతిలో ఉన్న చంటి బిడ్డతో సహా కిందపడిపోయింది. అంత దారుణంగా ప్రవర్తించాడు శ్రీకాంత్. ఇక ఆ తరువాత కరాటే కళ్యాణి మళ్లీ లేచి.. శ్రీకాంత్ రెడ్డిని పరిగెత్తించి పరిగెత్తించి గుడ్డలు ఊడేట్టుగా కొట్టింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అంతేకాదు, నాతో వీడియో చేయడానికి డబ్బులు అడిగిందని..నేను నో చెప్పడంతోనే ఆమె ఇలా కొడుతుందని శ్రీకాంత్ చెప్పగా.. కరాటే కళ్యాణి ఏమో ..వాడు నన్ను పక్కలోకి రమ్మనాడు అని..నా బొడ్డు పై చెయ్యి వేశాడు అని అందుకే కొట్టానని చెప్పుకొచ్చింది. దీని పై నెటిజన్స్ సైతం కరాటే కళ్యాణి పై మండి పడుతున్నారు. నీకు ప్రాబ్లమ్ ఉంటే పోలీసులకు చెప్పాలి కానీ..ఇలా చేయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news