Moviesచిరంజీవికి ఆ హీరోయిన్ల పెళ్లికి ఇంత లింక్ ఉందా... ఇదేం సెంటిమెంట్‌రా...

చిరంజీవికి ఆ హీరోయిన్ల పెళ్లికి ఇంత లింక్ ఉందా… ఇదేం సెంటిమెంట్‌రా బాబు..!

ఎస్ ఇప్పుడు ఇదే విష‌యం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో బాగా హైలెట్ అవుతోంది. జ‌స్ట్ చిరంజీవి ప‌క్క‌న ఓ హీరోయిన్ అలా న‌టించిందో లేదో వెంట‌నే ఆ హీరోయిన్‌కు పెళ్ల‌యిపోతోంది. మొన్న‌టికి మొన్న కాజ‌ల్‌.. ఆ త‌ర్వాత న‌య‌న‌తార‌.. ఇప్పుడు త‌మ‌న్నా ఇదే లిస్టులో జాయిన్ అయిపోతున్నారు. చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య సినిమాలో కాజ‌ల్‌ను ముందుగా హీరోయిన్‌గా అనుకున్నారు. ఆ మాట‌కు వ‌స్తే చిరు ఆచార్య కంటే ముందే రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలోనూ కాజ‌లే హీరోయిన్.

ఆ త‌ర్వాత సైరాలో న‌య‌న‌తార‌, త‌మ‌న్నా హీరోయిన్లుగా చేశారు. ఇక ఆచార్య నుంచి మ‌ళ్లీ హీరోయిన్ల‌ను రిపీట్ చేస్తూ వ‌స్తున్నారు. ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా హీరోయిన్‌నే ఆచార్య‌లోనూ అనుకున్నారు. అయితే క‌రోనా కార‌ణంగా షూటింగ్ లేట్ అవ్వ‌డంతో ఈ లోగా కాజ‌ల్ పెళ్లి జ‌రిగిపోవ‌డం అయిపోయింది. దీంతో కాజ‌ల్ క్యారెక్ట‌ర్‌నే సినిమా నుంచి తీసేశారు.

ఇక ఇప్పుడు చిరు మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో గాడ్‌ఫాద‌ర్ సినిమా చేస్తున్నాడు. మ‌ల్లూవుడ్ హిట్ సినిమా లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్. ఆమె సైరాలో కూడా చిరు ప‌క్క‌న న‌టించింది. ఈ సినిమాలో షూటింగ్ పూర్త‌య్యిందో లేదో ఆమె త‌న ప్రియుడు విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లాడ‌బోతోంది. అలా అని దీనికి లాజిక్ కూడా ఏమీ లేదు. ఓ సెంటిమెంట్‌లా న‌డిచిపోతోంది.

 

ఇక ఇప్పుడు ఇదే బాట‌లో త‌మ‌న్నా పేరు కూడా వినిపిస్తోంది. త‌మ‌న్నా కూడా చిరు ప‌క్క‌న భోళా శంక‌ర్ సినిమా చేస్తోంది. త‌మ‌న్నా కూడా గ‌తంలో చిరు ప‌క్క‌న సైరా సినిమా చేసింది. ఇప్పుడు ఆమెకు కూడా త్వ‌ర‌లోనే పెళ్ల‌యిపోతుందా ? అన్న చ‌ర్చ‌లు నడుస్తున్నాయి. త‌మ‌న్నా వ‌య‌స్సు మూడున్న‌ర ప‌దుల‌కు చేరువ అయ్యింది. ఏదో వెంకీ ప‌క్క‌న ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో ఛాన్సులు వ‌చ్చాయి.. ఇటు చిరు భోళా శంక‌ర్‌లో ఛాన్స్ రాక‌పోతే ఆమె ఖాళీగా కూర్చొని గోళ్లు గిల్లుకోవాల్సిన ప‌రిస్థితే ఉండేది.

అయితే ఇప్పుడు సీనియ‌ర్ హీరోల‌కు ఆమె మంచి ఆప్ష‌న్ అయిపోయింది. ఈ క్ర‌మంలోనే భోళా శంక‌ర్‌లో ఛాన్స్ రావ‌డంతో మ‌రో యేడాది పాటు ఆమె కెరీర్‌ను నెట్టుకు వ‌చ్చేందుకు అవ‌కాశం వ‌చ్చింది. మ‌రి ఇప్పుడు భోళాశంక‌ర్ సినిమా పూర్త‌య్యేలోగా త‌మ‌న్నా పెళ్లిక‌బురు న్యూస్ వింటామా ? లేదా ? అన్న‌ది చూడాలి. మ‌రి చిరు సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయితే త‌మ‌న్నా కూడా ఓ ఇంటిది అయిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news