Moviesబాల‌య్య - చిరు - చ‌ర‌ణ్ - మ‌హేష్ కొత్త సినిమాల...

బాల‌య్య – చిరు – చ‌ర‌ణ్ – మ‌హేష్ కొత్త సినిమాల టైటిల్స్ ఇవే.. అదుర్స్ అనాల్సిందే..!

ప్ర‌స్తుతం క‌రోనా పూర్తిగా త‌గ్గిపోయి జ‌నాలు అంద‌రూ మునుప‌టి మూడ్‌లోకి వ‌చ్చేయ‌డంతో మ‌ళ్లీ అన్ని రంగాలు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు రెండేళ్ల‌కు పైగా ఎలాంటి సినిమాలు చేయ‌కుండా ఖాళీగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే త‌మ సినిమాల‌ను వ‌రుస పెట్టి ఓ వైపు రిలీజ్ చేస్తూనే.. మ‌రోవైపు సినిమాలు లైన్లో పెడుతున్నారు. ఇప్పుడు సీనియ‌ర్ హీరోల చేతిలోనే ఏకంగా మూడు నాలుగేసి సినిమాలు లైన్లో ఉన్నాయి.

చిరంజీవి, నాగార్జున‌, బాల‌య్య‌, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్, మ‌హేష్‌బాబు ఇలా ప్ర‌తిఒక్క‌రు ఓ సినిమా సెట్స్ మీద ఉండ‌గానే… మ‌రో సినిమాను కూడా లైన్లో పెట్టేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి, బాల‌య్య‌, చ‌ర‌ణ్‌, మ‌హేష్‌బాబు కొత్త సినిమాలు కూడా కొన్ని షూటింగ్‌లో ఉండ‌గా.. మ‌రికొన్ని త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్నాయి. బాల‌య్య అఖండ గ‌ర్జ‌న త‌ర్వాత మ‌లినేని గోపీ, అనిల్ రావిపూడి, బోయ‌పాటి శ్రీను, పూరి జ‌గ‌న్నాథ్ లాంటి డైరెక్ట‌ర్ల‌తో వ‌రుస‌గా సినిమాలు లైన్లో పెట్టేశాడు.

మ‌లినేని గోపీ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమాలో న‌టిస్తోన్న సినిమాకు అన్న‌గారు అన్న టైటిల్ వినిపించింది. ఇప్పుడు క్యాచీగా ఉంటుంద‌ని జై బాల‌య్యా టైటిల్ దాదాపు ఖ‌రారు చేసేశార‌ని అంటున్నారు. అఖండ సినిమాలో జై బాల‌య్యా సాంగ్ ఎలా పేలిందో చూశాం. ఇక చిరంజీవి మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో గాడ్‌ఫాద‌ర్‌, మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో భోళాశంక‌ర్ సినిమాలు చేస్తున్నాడు. అలాగే బాబి ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీర‌య్య అధికారికంగా ఖ‌రారైన‌ట్టే..!

ఇక మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో 12 ఏళ్ల త‌ర్వాత సినిమా వ‌స్తోంది. ఈ సినిమాకు అర్జునుడు అనే టైటిల్ అనుకుంటున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త్రివిక్ర‌మ్‌కు క‌లిసి వ‌చ్చేలా అ సెంటిమెంట్‌తోనే ఈ టైటిల్ ఫిక్స్ చేసుకున్నార‌ట‌. ఇక రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో 15వ ప్రాజెక్టుగా వ‌స్తోన్న సినిమాకు ముందు స‌ర్కారోడు అనే టైటిల్ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టుకు అధికారి అనే టైటిల్ దాదాపు ఫిక్స్ చేసిన‌ట్టు టాక్ ?

దిల్ రాజు బ్యాన‌ర్లో 50వ ప్రాజెక్టుగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. ఏదేమైనా వ‌రుస‌గా చూస్తే జై బాల‌య్యా – అర్జునుడు – అధికారి – వాల్తేరు వీర‌య్య లాంటి ప‌వ‌ర్ ఫుల్ టైటిల్స్‌తో మ‌న హీరోలు మాంచి ఆస‌క్తి లేపుతున్నారు. మ‌రి రేపు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పిస్తారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news