Moviesఇండ‌స్ట్రీకి బ్రీతింగ్ ఇచ్చిన ' అఖండ‌ ' ... త్రిబుల్ ఆర్,...

ఇండ‌స్ట్రీకి బ్రీతింగ్ ఇచ్చిన ‘ అఖండ‌ ‘ … త్రిబుల్ ఆర్, కేజీయ‌ఫ్ 2 క‌న్నా పెద్ద హిట్ ఎలాగంటే..!

ఎస్ ఇది నిజం.. ఇప్పుడు ఇండ‌స్ట్రీ ట్రేడ్ వ‌ర్గాల్లో ఇదే బిగ్ హాట్ టాపిక్‌. కేజీయ‌ఫ్ 2, త్రిబుల్ ఆర్ సినిమాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 1200 కోట్లు వ‌చ్చాయి. ఇవి పాన్ ఇండియా రేంజ్‌లో హిట్లు అవ్వ‌వ‌చ్చు. కానీ ఇవి కొన్న వాళ్ల‌కు వ‌చ్చిన లాభాలు.. ఆ సినిమాల‌కు ముంద‌స్తుగా పెట్టిన పెట్టుబ‌డి… వ‌చ్చిన లాభాలు చూసుకుంటే అఖండే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అని.. అఖండ సినిమా కొన్న‌వారికి దాదాపు యేడాది పాటు పెద్ద బ్రీతింగ్ ఇచ్చింద‌ని ఓ ట్రేడ్ ప్ర‌ముఖుడు చెప్పాడు.

ఉదాహ‌ర‌ణ‌కు గోదావ‌రి జిల్లాలోని ఓ సీ సెంట‌ర్లో త్రిబుల్ ఆర్ సినిమాను రు. 12 ల‌క్షల‌కు కొన్నారు. ఆ సినిమాకు లాంగ్ ర‌న్‌లో రు. 11 ల‌క్షలు మాత్ర‌మే వ‌చ్చాయి. రు. ల‌క్ష న‌ష్టంతో పాటు మూడు వారాల పాటు థియేట‌ర్ ఖ‌ర్చులు కూడా పోయాయి. అఖండ వ‌సూళ్ల‌తో పోలిస్తే త్రిబుల్ ఆర్ వ‌సూళ్లు డ‌బుల్ అయిన‌ట్టే..! కానీ అఖండ‌కు అదే థియేట‌ర్లో రెండు, మూడు రెట్ల లాభాలు వ‌స్తే త్రిబుల్ ఆర్‌కు న‌ష్టం వ‌చ్చింది. అదే థియేట‌ర్లో అఖండ‌ను రు. 2.5 ల‌క్ష‌ల‌కు కొంటే రు. 7 ల‌క్ష‌ల వ‌సూళ్లు వ‌చ్చాయి.

ఇక రాయ‌ల‌సీమ‌లో అఖండ చాలా మంది ఎగ్జిబిట‌ర్ల‌ను బ‌తికించింది. ఈ సినిమాను సీడెడ్ ( రాయ‌ల‌సీమ‌)లో ఎగ్జిబిట‌ర్లు రు 1.5 ల‌క్ష‌ల హ‌య్య‌ర్‌కు కొంటే రు. 15 ల‌క్ష‌ల వ‌సూళ్లు వ‌చ్చాయ‌ట‌. అంటే థియేట‌ర్ల వాళ్లు ఓ యేడాది పాటు ప్ర‌శాంతంగా ఊపిరి పీల్చుకునేంతగా అఖండకు లాభాలు వ‌చ్చాయ‌ట‌. హ‌య్య‌ర్ అంటే సినిమాను రు 1.5 ల‌క్ష‌ల‌కు కొంటారు. న‌ష్టం వ‌చ్చినా.. లాభం వ‌చ్చినా నిర్మాత‌ల‌కు, ఎగ్జిబిట‌ర్ల‌కు ఏ మాత్రం సంబంధం ఉండదు. వాళ్ల కౌంట్లో ఉండ‌దు.

సీడెడ్‌లో అయితే 100కు పైగా సింగిల్ స్టేష‌న్ల‌లో ఒక్కో స్టేష‌న్‌కు రు. 10 ల‌క్ష‌ల‌కు పైగా లాభాలు రావ‌డంతో ఆ థియేట‌ర్ల వాళ్ల ఆనందం అయితే మామూలుగా లేద‌ట‌. ఈ లాభ‌మే ఇప్పుడు వాళ్లు ధైర్యంగా వ్యాపారం చేసేందుకు దోహ‌ద‌ప‌డుతోంది. ఈ లెక్క‌న రు. 1.5 ల‌క్ష‌ల పెట్టుబ‌డి పెడితే వాళ్ల‌కు రు. 15 ల‌క్ష‌లు వ‌చ్చింది. అంటే ఎలా లేద‌న్నా రు. 10 ల‌క్ష‌లకు పైనే లాభం వ‌చ్చింది. అదే త్రిబుల్ ఆర్‌కు రు. 1-2 ల‌క్ష‌ల న‌ష్టం.

 

ఇంకా చెప్పాలంటే ఎంతో పెద్ద హిట్ అని చెప్పుకుంటోన్న కేజీయ‌ఫ్ 2కు కూడా రు. 50 వేలు, రు. ల‌క్ష త‌ప్పా పెద్ద‌గా లాభాలు రాలేదు. అయితే త్రిబుల్ ఆర్‌తో పోలిస్తే కేజీయ‌ఫ్ 2 బెట‌ర్ అనిపించింది. రాధేశ్యామ్‌, ఆచార్య‌, ఖిలాడీ.. చివ‌ర‌కు స‌ర్కారు వారి పాట సినిమాకు కూడా న‌ష్టాలు త‌ప్ప‌లేదు. మ‌రి అఖండ లేక‌పోయి ఉంటే ఈ బ‌య్య‌ర్ల ప‌రిస్థితి ఏమ‌య్యేది ? ఇదే విష‌యాన్ని ఇప్పుడు ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news